E-Paper
Advertisement

ఫోన్ కొంటే ఇయర్‌బడ్స్ ఫ్రీ.. Ai Plus Nova 2 Ultra 5Gపై క్రేజీ ఆఫర్, పూర్తి వివరాలివే!

ఫోన్ కొంటే ఇయర్‌బడ్స్ ఫ్రీ.. Ai Plus Nova 2 Ultra 5Gపై క్రేజీ ఆఫర్, పూర్తి వివరాలివే!
Advertisement

Ai Plus Nova 2 Ultra 5G: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. ఏఐ ప్లస్ కంపెనీ నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Nova 2 Ultra 5G మార్కెట్లోకి విడుదలైంది. ధర తక్కువ మాత్రమే కాదు.. లుక్స్ పరంగా, బ్యాటరీ లైఫ్ పరంగా కూడా ఈ ఫోన్ అదిరిపోయిందని చెప్పాలి. అందుకే ఇప్పుడు టెక్ వర్గాల్లో ఈ ఫోన్ గురించే చర్చ నడుస్తోంది.

ఉచితంగా ఇయర్ బడ్స్..

ఈ Ai Plus Nova 2 Ultra 5G ఫోన్ మొదటి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైంది. లాంచ్ ఆఫర్ కింద కంపెనీ రూ.2,000 వరకు తగ్గింపు ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ జస్ట్ రూ.14,999కే వచ్చేస్తుందన్నమాట. అంతే కాదండోయ్.. ముందే కొనేవారికి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. అదేంటంటే.. ఫోన్‌తో పాటు ఇయర్‌బడ్స్‌ను కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదేనేమో.

Advertisement

Also Read: పర్పుల్ లుక్‌, 10,000mAh భారీ బ్యాటరీ.. అబ్బా ఏముంది మావా ఈ Vivo Y600 Pro స్మార్ట్‌ఫోన్!

RGB లైట్స్ హైలైట్..

ఇప్పుడు వస్తున్న ఫోన్లన్నీ దాదాపు ఒకేలా బోర్ కొట్టిస్తున్నాయి అనుకునే వాళ్ల కోసం ఈ నోవా 2 అల్ట్రాలో వెనుక వైపు ఆర్‌జీబీ లైట్స్ ఇచ్చారు. ఫోన్‌కు ఏదైనా మెసేజ్ వచ్చినా లేదంటే ఎవరైనా ఫోన్ చేసినా ఆ లైట్లు రకరకాల రంగుల్లో మెరుస్తూ భలే కొత్తగా కనిపిస్తాయి. ఇక ఫోన్ స్క్రీన్ కూడా చాలా పెద్దది. 6.78 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉండటం వల్ల సినిమా చూసినా, గేమ్ ఆడినా మెరుగైన పనితీరు అందిస్తుంది. పైగా ఎండలోకి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ మీద ఉన్నవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

అద్భుతమైన కెమెరా సెటప్..

Advertisement

Ai Plus Nova 2 Ultra 5G స్పీడ్ విషయంలో కూడా తగ్గేదేలే అంటోంది. దీనిలో వాడిన చిప్‌సెట్ వల్ల గేమ్స్ ఆడినా లేదా మల్టీటాస్కింగ్ చేసినా ఎక్కడా హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా నడుస్తుంది. ఇక ఫోటోల విషయానికి వస్తే.. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. అలాగే ఇందులో OIS ఫీచర్ ఉండటం వల్ల మనం నడుస్తూ ఫోటోలు తీసినా లేదా వీడియోలు తీసినా అవి షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం కూడా ఇది బెస్ట్ ఆప్షన్.

కలర్ ఆప్షన్స్ ఇవే..

ఈ ఫోన్‌లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం 6000mAh బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే చాలు.. రోజంతా హెవీగా వాడినా ఛార్జింగ్ అయిపోతుందన్న భయం ఉండదు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా.. 33W ఫాస్ట్ ఛార్జర్ సాయంతో తొందరగానే ఛార్జ్ చేసుకోవచ్చు. బ్లూ, రెడ్, బ్లాక్ వంటి ఐదు రంగుల్లో దొరుకుతున్న ఈ ఫోన్, తక్కువ ఖర్చులో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి కచ్చితంగా నచ్చుతుంది.

Also Read: సామాన్యుల బడ్జెట్‌లోకి దిగొచ్చిన శాంసంగ్ ప్రీమియం ఫోన్లు.. ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×