E-Paper
Advertisement

అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటున్నారా?.. నాణ్యతను ఇలా చెక్ చేసుకోండి

అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటున్నారా?.. నాణ్యతను ఇలా చెక్ చేసుకోండి
Advertisement

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా మందికి సెంటిమెంట్. అయితే మీరు కొన్న జ్యువెలరీ స్వచ్ఛమైనదేనా? అందులో ఎంత బంగారం ఉంది? ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలి?

BIS లోగో – బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) బంగారం ఫ్యూరిటీని సర్టిఫై చేస్తుంది. బంగారు ఆభరణాలపై ట్రయల్ ఆకారంలో BIS లోగోను ముద్రిస్తారు. ఇది గోల్డ్ ప్యూరిటీకి అత్యంత నమ్మకమైన ఇండెక్స్.

Advertisement

నాణ్యత – బంగారు ఆభరణాల ప్యూరిటీని క్యారెట్లలో కొలుస్తారు. ఉదాహరణకు 22K 916 అంటే.. 100 గ్రాముల్లో 91.6% బంగారం, మిగిలినది ఇతర లోహాలు. 18K 750 అంటే 75% బంగారం, మిగిలినది వజ్రాలు, రాళ్లు, లోహాలు అని అర్థం.

HUID – హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ అంటే 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది బంగారం ప్యూరిటీని తెలియజేస్తుంది.

Advertisement

బంగారు ఆభరణాలు కొనే ముందు ఈ మూడింటిని చెక్ చేసుకోండి.

డిజిటల్ గా కూడా మీరు కొన్న ఆభరణాల నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. BIS కేర్ యాప్‌ లో ‘వెరిఫై HUID’ లో మీరు కొన్న జ్యువెలరీపై ఉన్న 6 అంకెల కోడ్‌ను ఎంటర్ చేస్తే
నగల వ్యాపారి రిజిస్ట్రేషన్ నేమ్, హాల్‌మార్కింగ్ వివరాలు, ప్యూరిటీ వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఒకవేళ యాప్ లో 22K అని ఉండి, వ్యాపారి మీకు 24K(క్యారెట్స్) అని చెబితే, అలాంటి చోట కొనకపోవడమే బెటర్.

Also Read: ఆర్బీఐ కొత్త గోల్డ్ లోన్ రూల్స్.. ఇక తక్కువ బంగారంపై ఎక్కువ లోన్ పొందవచ్చు

క్యారెట్ మీటర్

జ్యువెలరీ షాపుల్లో XRF (ఎక్స్-రే ఫ్లోరోసెన్స్) మెషీన్ ఉంటుంది. దీనినే క్యారెట్ మీటర్ అని పిలుస్తారు. ఇది ఆభరణాలకు ఎలాంటి నష్టం చేయకుండా.. స్కాన్ చేస్తుంది. మీరు కొన్న జ్యువెలరీలో బంగారం, వెండి, రాగి ఎంతెంత శాతం ఉన్నాయో కచ్చితంగా చెప్పగలదు. బిల్లు తీసుకునే ముందు జ్యువెలరీని ఈ మెషీన్‌ స్కాన్ చేయమని అడగవచ్చు. కేవలం 30 సెక్షన్లలో ఆభరణం పూర్తి వివరాలు అందిస్తుంది.

అయస్కాంత టెస్ట్ – స్వచ్ఛమైన బంగారం అయస్కాంతం కాదు. మీ ఆభరణాలు అయస్కాంతానికి అంటుకుంటే, వాటిలో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి లోహాలు ఎక్కువ శాతం ఉన్నాయని అర్థం.

మీరు చెల్లించిన డబ్బుకు తగిన బంగారం పొందుతున్నారని చెప్పేదే ఇన్‌వాయిస్‌. ఇది తప్పకుండా తీసుకోవాలి. ఇన్ వాయిస్ లో హాల్ మార్క్ నెంబర్, క్యారెట్స్, బంగారం బరువు, ఆ రోజు బంగారం ధర, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వివరాలు క్లియర్ గా ఉంటాయి.

అక్షయ తృతీయ నాడు కాస్త అయినా బంగారం కొనాలనేది హిందూ సంప్రదాయం. ఈ ఏడాది ఏప్రిల్ 20న అక్షయ తృతీయ. ఆ రోజు మీరు కొన్న బంగారాన్ని ఇలా చెక్ చేసుకోండి.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×