// // Ai+ Nova 2 Neo 5G: ఐదు క్రేజీ కలర్స్‌, గేమింగ్ లుక్‌తో వస్తున్న కొత్త 5జీ ఫోన్! -->
E-Paper
Advertisement

ఐదు క్రేజీ కలర్స్‌, గేమింగ్ లుక్‌తో వచ్చేస్తోన్న Ai Plus 5G ఫోన్లు.. లాంచ్‌కు ముందే లుక్ లీక్!

ఐదు క్రేజీ కలర్స్‌, గేమింగ్ లుక్‌తో వచ్చేస్తోన్న Ai Plus 5G ఫోన్లు.. లాంచ్‌కు ముందే లుక్ లీక్!
Advertisement

Ai+ Nova 2 Neo 5G: ప్రముఖ టెక్ బ్రాండ్ Ai+ మార్కెట్లోకి సరికొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. తమ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ Nova 2 Neo 5G, Nova 2 Pro 5G మోడళ్లను త్వరలోనే పరిచయం చేయనుంది. అయితే ఈ ఫోన్ల అధికారిక లాంచ్‌ కంటే ముందే, వీటి డిజైన్‌ను కంపెనీ రివీల్ చేసింది. బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగంలో స్టైలిష్ లుక్‌తో రాబోతున్న ఈ ఫోన్లు ఇప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

యువతను ఆకట్టుకునే డిజైన్:

ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఫోన్ల తరహాలో ప్రీమియం విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే లక్ష్యంగా Ai+ ఈ కొత్త ఫోన్లను డిజైన్ చేసింది. అదిరిపోయే ఫినిషింగ్, వినూత్నమైన కెమెరా మాడ్యూల్స్, ఆకట్టుకునే రంగులతో ఈ స్మార్ట్‌ఫోన్లను రూపొందించారు. ముఖ్యంగా పర్ఫార్మెన్స్‌తో పాటు లుక్‌కి ప్రాధాన్యత ఇచ్చే నేటితరం యువతను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకొస్తున్నారు.

Nova 2 Pro గేమింగ్ లుక్:

Advertisement

ఈ రెండింటిలో Nova 2 Pro 5G మోడల్ తమ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. దీని వెనుక భాగంలో డ్యూయల్ పిల్‌ షేప్ కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు. ఈ కెమెరా సెటప్ పైన ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వెంట్ డిజైన్ ఫోన్‌కు ఫ్యూచరిస్టిక్, గేమింగ్ లుక్‌ను ఇస్తోంది. గతంలో వచ్చిన Nova 2 Ultra పోలికలు దీనిలో కొన్ని కనిపిస్తున్నప్పటికీ.. సరికొత్త స్టైలింగ్ వల్ల దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. విభిన్నమైన లుక్ కోరుకునే కంటెంట్ క్రియేటర్లకు ఇది బాగా నచ్చుతుంది.

Also Read: మన బాడీకి ఏం కావాలో ముందే చెప్పేసే Luna AI Band.. భారత్‌లో రిజిస్ట్రేషన్లు షురూ!

కలర్ ఆప్షన్స్ అదిరిపోయాయి:

Advertisement

ఈ ఫోన్లలో కలర్ ఛాయిస్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. Nova 2 Pro 5G మోడల్ ఏకంగా ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్, లైట్ బ్లూ, రెడ్, పింక్ షేడ్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇన్ని కలర్ ఆప్షన్స్ ఇవ్వడం చాలా అరుదు. దీనివల్ల యూజర్లు తమకు నచ్చిన స్టైల్‌ను ఎంచుకోవచ్చు.

నోవా 2 నియో ప్రీమియం లుక్:

మరోవైపు Nova 2 Neo 5G కూడా చాలా డిఫరెంట్ డిజైన్‌తో వస్తోంది. దీని వెనుక భాగంలో పొడవాటి పిల్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంది. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. దీనికి జతగా రింగ్ స్టైల్ ఎల్ఈడీ ఫ్లాష్‌ను చేర్చడం వల్ల ఫోన్‌కు చాలా మోడ్రన్ లుక్ వచ్చింది. ఈ బ్యాక్ ప్యానెల్ డిజైన్ చూస్తే ప్రీమియం రేంజ్ ఫోన్‌లా అనిపిస్తుంది. ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Also Read: టెక్ ప్రియులకు గోల్డెన్ ఛాన్స్.. Galaxy Z Fold 4పై ఏకంగా రూ.65వేలు తగ్గింది, స్టాక్ లిమిటెడ్ మావా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×