E-Paper
Advertisement

ఇంటి కోసం వాల్ క్లాక్ కొంటున్నారా? ఈ 3 మోడ్రన్ డిజిటల్ డిజైన్లపై ఓ లుక్కేయండి!

ఇంటి కోసం వాల్ క్లాక్ కొంటున్నారా? ఈ 3 మోడ్రన్ డిజిటల్ డిజైన్లపై ఓ లుక్కేయండి!
Advertisement

Digital wall clock for home: ఇంటి అందాన్ని పెంచడంలో వాల్ క్లాక్స్ (Wall Clocks) ఎప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే పాతకాలపు ముల్లున్న గడియారాల స్థానంలో ఇప్పుడు సరికొత్త ‘డిజిటల్ వాల్ క్లాక్స్’ ట్రెండ్‌గా మారాయి. ఇవి కేవలం సమయాన్ని చూపించడమే కాకుండా.. రూమ్ టెంపరేచర్, తేదీ, వారం వంటి మరెన్నో వివరాలను డిస్‌ప్లే చేస్తాయి. మీ హాల్ లేదా బెడ్‌రూమ్ గోడలకు మోడ్రన్ , స్టైలిష్ లుక్ ఇచ్చే 3 బెస్ట్ డిజిటల్ వాల్ క్లాక్ డిజైన్లు, వాటి ఫీచర్లు ,ఖచ్చితమైన ధరల వివరాలు మీకోసం..

స్టైలిష్ డిజిటల్ వాల్ క్లాక్స్:

1. 3D ఎల్‌ఈడీ డిజిటల్ వాల్ క్లాక్ (3D LED Modern Digital Wall Clock):
ప్రస్తుతం నయా ట్రెండ్‌ను ఫాలో అయ్యే యువతకు ఈ 3D ఎల్‌ఈడీ క్లాక్ బాగా నచ్చుతుంది. దీనికి ఎలాంటి ప్రేమ్ ఉండదు, కేవలం నంబర్లు మాత్రమే గాల్లో తేలుతున్నట్లు గోడపై కనిపిస్తాయి. ఇది చాలా మోడ్రన్‌గా, మినిమలిస్టిక్ లుక్‌తో ఉంటుంది. రాత్రి వేళల్లో ఈ క్లాక్ మీ గదికి ఒక లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. అంతే కాకుండా ఇందులో మూడు రకాల బ్రైట్‌నెస్ మోడ్స్ ఉంటాయి. చీకటి పడగానే ఇది ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్‌ను తగ్గించుకుంటుంది. దీనివల్ల కళ్లకు ఇబ్బంది ఉండదు. ఇందులో అలారం, నైట్ లైట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Advertisement

ధర: రూ. 849

2. కాసియో డిజిటల్ ఐడియల్ వాల్ క్లాక్ (Casio Digital Thermometer & Hygrometer Clock):
బ్రాండెడ్ క్వాలిటీతో పాటు ఎక్కువ సమాచారాన్ని ఒకే స్క్రీన్‌పై చూడాలనుకునే వారికి కాసియో డిజిటల్ క్లాక్ ఒక అద్భుతమైన ఆప్షన్. దీని పెద్ద ఎల్‌సీడీ (LCD) డిస్‌ప్లేపై సమయంతో పాటు గదిలోని ఉష్ణోగ్రత, తేమ శాతం కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ప్యూర్ సిల్వర్ లేదా బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఆఫీస్ రూములు, స్టడీ రూమ్స్ లేదా హాల్‌ గోడలకు ఇది చాలా క్లాసిక్ అండ్ ప్రొఫెషనల్ లుక్‌ను ఇస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ కాలం వస్తుంది.

Advertisement

ధర: రూ.2,495

Also Read: పాతకాలపు అందం.. లేటెస్ట్ టెక్నాలజీ, ఈ వేసవికి బెస్ట్ క్లాసిక్ ఫ్యాన్స్!

3. అజంతా క్వార్ట్జ్ ఎల్‌ఈడీ డిజిటల్ క్లాక్ (Ajanta Quartz Big LED Digital Wall Clock):
దశాబ్దాలుగా నమ్మకమైన బ్రాండ్‌గా ఉన్న అజంతా నుంచి వచ్చిన పెద్ద సైజ్ ఎల్‌ఈడీ క్లాక్ ఇది. దూరంగా ఉన్నా కూడా టైమ్ స్పష్టంగా కనిపించాలనుకునే పెద్ద ఇళ్లకు ఇది పర్ఫెక్ట్. దీనిలో సమయంతో పాటు తేదీ, నెల, సంవత్సరం , వారం కూడా పెద్ద అక్షరాలతో ఎరుపు లేదా నీలం రంగు ఎల్‌ఈడీ లైట్లతో కనిపిస్తాయి. కరెంట్ పోయినా కూడా టైమ్ మారిపోకుండా ఉండటానికి దీనిలో.. మెమరీ బ్యాకప్ ఫీచర్ ఉంటుంది. ఇల్లు లేదా పెద్ద షాపులు, ఆఫీసుల హాల్స్‌లో పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది.

ధర: రూ.1,299

ఒకప్పుడు గడియారం అంటే కేవలం టైమ్ చూసుకోవడానికే.. కానీ ఇప్పుడు అది ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఒక డెకరేషన్ ఐటమ్‌గా మారింది. పైన పేర్కొన్న మూడు డిజైన్లలో మీ ఇంటి ఇంటీరియర్ స్టైల్‌కు ఏది సెట్ అవుతుందో చూసి ఎంచుకోవచ్చు. మోడ్రన్ లుక్ కోసం 3D ఎల్‌ఈడీ, బ్రాండెడ్ ఫీచర్ల కోసం కాసియో, లేదా బడ్జెట్‌లో పెద్ద డిస్‌ప్లే కోసం అజంతా క్లాక్ కొనవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×