E-Paper
Advertisement

Ai+ Laptab: ఇండియన్ కంపెనీ కొత్త ల్యాప్‌టాబ్.. ల్యాప్‌టప్ + టాబ్లెట్ రెండూ ఒకే ఒకే డివైస్‌లో

Ai+ Laptab: ఇండియన్ కంపెనీ కొత్త ల్యాప్‌టాబ్.. ల్యాప్‌టప్ + టాబ్లెట్ రెండూ ఒకే ఒకే డివైస్‌లో
Advertisement

Ai+ Laptab| భారతీయ కంపెనీ అయిన Ai+ ఒక అద్భుతమైనడివైస్‌ను తయారు చేసింది. దీని పేరు ల్యాప్‌టాబ్ (Laptab). ఈ కొత్త డివైస్‌లో ల్యాప్‌టాప్ లాంటి పవర్ తో పాటు ట్యాబ్లెట్ లాగా సులువుగా తీసుకెళ్లే పోర్టెబులిటీ ఉంటుంది. స్టూడెంట్స్, ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ వర్క్, డ్రాయింగ్, ఎంటర్‌టైన్‌మెంట్.. అన్ని అవసరాలకు ఒక్కటే డివైస్ సరిపోతుంది. ఇది నిజంగా మధ్యతరగతికి టార్గెట్ చేస్తూ రూపొందించిన ఉత్పత్తి.

Laptab అంటే ఏమిటి?

ల్యాప్‌టాబ్ అంటే ల్యాప్‌టాప్ + ట్యాబ్లెట్ ఫీచర్లు కలిపిన హైబ్రిడ్ డివైస్. మీరు కీబోర్డ్ అటాచ్ చేస్తే పూర్తి ల్యాప్‌టాప్ లాగా పనిచేస్తుంది. కీబోర్డ్ తీసేస్తే సన్నని ట్యాబ్లెట్ లాగా ఉపయోగపడుతుంది. 11 ఇంచ్, 12 ఇంచ్, 13 ఇంచ్.. మూడు సైజుల్లో వస్తుంది. ప్రతి మోడల్‌కి కీబోర్డ్, స్టైలస్ పెన్ వేరుగా తీసేయొచ్చు.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?

  • కీబోర్డ్ తీసేయొచ్చు. టైపింగ్ చేయాలంటే అటాచ్ చేసుకోండి
  • స్టైలస్ పెన్ ఉంది. రాయడం, డ్రాయింగ్, నోట్స్ చాలా సులువుగా చేసుకోవచ్చు.
  • ఇది NxtQ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. డెస్క్‌టాప్ లాంటి ఫీల్ కూడా ఇస్తుంది.
  • ఇందులో ప్రత్యేక PC మోడ్ కూడా ఉంది. ఒకేసారి చాలా యాప్స్ ఓపెపన్ చేసి పనిచేయొచ్చు.
  • ఆన్‌లైన్ క్లాసులు, ప్రెజెంటేషన్స్, వీడియో ఎడిటింగ్.. అన్నీ స్మూత్‌గా నడుస్తాయి

ధర, లభ్యత

Advertisement

Ai+ కంపెనీ ఈ కొత్త Laptabని 2026లో లాంచ్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్, Ai+ స్టోర్లలో లభిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంచుతామని కంపెనీ చెబుతోంది. అంటే స్టూడెంట్స్ నుంచి ఆఫీస్ ఉద్యోగులు.. ఎవరైనా కొనుగోలు చేయొచ్చు.

Ai+ సిఈఓ ప్రకటన

“ఇది సాధారణ ట్యాబ్లెట్ కాదు. ఇప్పటి భారతీయుల జీవితంలో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా రూపొందించాం. ఒకే డివైస్‌తో చదువు, క్రియేటివ్ వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్.. అన్నీ చేయొచ్చు” అని కంపెనీ సిఈఓ మాదవ్ శేఠ్ చెప్పారు.

ఈ డివైజ్ ఎవరికి బెస్ట్?

Advertisement

ఆన్‌లైన్ క్లాసులు తీసుకునే స్టూడెంట్స్ కు, డ్రాయింగ్, ఎడిటింట్ డిజైన్ చేసే క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కు, ఆఫీస్‌లో ప్రెజెంటేషన్స్, మీటింగ్స్ ఉన్న వాళ్లు. ఇంట్లో సినిమాలు, గేమ్స్ ఆడాలనుకునే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Ai+ ఇప్పటివరకు ఏం అమ్ముతోంది?

ఇప్పటికే Ai+ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కు ఇండియన్ మార్కెట్లో బాగా సేల్ అవుతున్నాయి. ఇప్పుడు Laptab కూడా లాంచ్ అయితే.. కంపెనీ ప్రొడక్ట్ రేంజ్ మరింత పెరుగుతుంది. అంటే Ai+ పూర్తి టెక్ ఎకోసిస్టమ్ రెడీ!

Also Read: ఇన్‌స్టామార్ట్‌ని మోసం చేసిన కస్టమర్.. ఏఐ ఫోటో చూపించి దోపిడీ

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×