// // DeepMind Robot Scientists| శాస్త్రవేత్తలుగా ఏఐ రోబోలు.. సినిమా కాదు నిజంగానే -->
E-Paper
Advertisement

DeepMind Robot Scientists: శాస్త్రవేత్తలుగా ఏఐ రోబోలు.. సినిమా కాదు నిజంగానే.. గూగుల్ సాహసం

DeepMind Robot Scientists: శాస్త్రవేత్తలుగా ఏఐ రోబోలు.. సినిమా కాదు నిజంగానే.. గూగుల్ సాహసం
Advertisement

Google DeepMind Robot Scientists| టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా రోబోటిక్ సైన్స్ రంగంలో ఊహకందని స్థాయిలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్ ఒక కొత్త అత్యాధునిక సైన్స్ ల్యాబ్ నిర్మించబోతోంది.

యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) లో గూగుల్ డీప్‌మైండ్ ల్యాబ్ లో ఏఐ రోబోలు కొత్త ఆవిష్కరణలు, అధ్యయనాల కోసం ప్రయోగాలు చేయబోతున్నాయి. అంతా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లుగా జరుగుతుంది. యూకే ప్రభుత్వంతో గూగుల్ భాగస్వామిగా కలిసి ఈ స్పెషల్ ల్యాబ్ లో ప్రయోగాలు చేయబోతోంది. ఈ ప్రయోగాలు ముఖ్యంగా కొత్త మెటీరియల్స్ కనుగొనడం కోసం జరుగుతాయి. ఈ కొత్త మెటీరియల్స్ అన్నీ.. బ్యాటరీలు, సెమీకండక్టర్స్, హెల్త్‌కేర్, రెన్యూవబుల్ ఎనర్జీకి ఉపయోగపడతాయి. 2026లో ల్యాబ్ పని ప్రారంభమవుతుంది.

శాస్త్రవేత్తలుగా AI రోబోలు

Advertisement

వినడానికి ఆశ్చర్యకంగా ఉన్నా.. AI రోబోలను గూగుల్ నిజమైన మెటీరియల్ సైంటిస్ట్‌ (శాస్త్రవేత్త) లాగా పని చేయించాలనుకుంటోంది. ఒక AI రోబో.. ఎక్స్‌పెరిమెంట్స్ (ప్రయోగాలు) ప్లాన్ చేస్తుంది, డేటా అనలైజ్ చేస్తుంది. రోబోలు ఫిజికల్ పనులు చేస్తాయి. ముందు ఎక్స్‌పెరిమెంట్ పరిణామాలు బట్టి తర్వాత ఏం చేయాలో AI నిర్ణయిస్తుంది. మనుషులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం దాదాపు ఉండదు. పనులన్నీ రోబోలే స్వయంగా చేస్తాయి.

రోజుకి వందల ఎక్స్‌పెరిమెంట్స్

గూగుల్ దీని గురించి ఇటీవలే బ్లాగ్ పోస్ట్‌ చేసింది. అందులో రోబోలు రోజుకి వందల సాంపుల్స్ తయారు చేసి టెస్ట్ చేస్తాయి. డీప్‌మైండ్ AI మోడల్స్, ముఖ్యంగా Gemini AI ఈ ప్రాసెస్‌ని గైడ్ చేస్తుంది. ఇప్పటివరకు సైంటిస్ట్స్ మాన్యువల్‌గా చేసేవి. ఇప్పుడు చాలా వేగంగా జరుగుతుంది. ఆవిష్కరణలు కూడా త్వరగా వెలుగు చూస్తాయి.

పూర్తి ఆటోమేటిక్‌గా నడిచే ల్యాబ్

Advertisement

ల్యాబ్ పూర్తిగా ఆటోమేటిక్‌గా పని చేస్తుంది. రోజువారీ పనులు మెషిన్స్ చేస్తాయి. Gemini AI అన్ని సిస్టమ్స్‌లో ఇంటిగ్రేట్ అవుతుంది. తర్వాత ఏ ఎక్స్‌పెరిమెంట్ చేయాలో AI నిర్ణయిస్తుంది. రోబోట్స్ ఆ పని వెంటనే చేస్తాయి. మనుషులు ఎక్కువగా జోక్యం చేసుకోరు.

మనుషుల పాత్ర ఏమిటి?

మనుషులు పూర్తిగా బయటకు వెళ్లలేరు. సైంటిస్ట్స్ రిజల్ట్స్ చూసి విశ్లేషిస్తారు, ఎక్స్‌పెరిమెంట్స్ వెరిఫై చేస్తారు. సిస్టమ్ సరిగ్గా పని చేస్తుందో లేదో చూస్తారు. రిపీట్ పనులు మెషిన్స్ చేస్తాయి కాబట్టి సైంటిస్ట్స్ పెద్ద ప్లాన్స్, స్ట్రాటజీల మీద ఫోకస్ చేయొచ్చు.

యూకే ప్రభుత్వంతో భాగస్వామ్యం

గూగుల్ యూకే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సైన్స్, ఎడ్యుకేషన్, పబ్లిక్ సర్వీసెస్‌లో ఏఐని ఉపయోగించాలనేది ప్లాన్. ఈ ల్యాబ్ ఆ ఒప్పందంలో ముఖ్య భాగం. యూకేలో సైన్స్ ఇన్నోవేషన్ పెరగాలని లక్ష్యం.

యూకే సైంటిస్ట్స్‌కి ప్రత్యేక లాభాలు

యూకే సైంటిస్ట్స్ డీప్‌మైండ్ కొత్త AI మోడల్స్ ముందుగానే అందుబాటులోకి వస్తాయి. DNA స్ట్రక్చర్స్, వాతావరణం అనలైజ్ చేయొచ్చు. టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులకి స్పెషల్ Gemini AI వస్తుంది.

ఈ ల్యాబ్ సైన్స్ రంగంలో పెద్ద మార్పు తెస్తుంది. AI, రోబోట్స్ కలిసి కొత్త ఆవిష్కరణలు త్వరగా తెస్తాయి.

Also Read: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×