E-Paper
Advertisement

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?
Advertisement

Flight Mode: ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అలాగే తమ ఫోన్లలో ఫ్లైట్ మోడ్ ఆప్షన్‌ను చూసే ఉంటారు. మరికొన్ని ఫోన్లలో ఇది ఎయిర్‌ప్లేన్ మోడ్ అనే పేరుతో కూడా ఉంటుంది. ఇకపోతే, వీటి పేరుకు తగ్గట్టే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఫ్లైట్‌మోడ్ ఆన్ చేస్తుంటారు ఎక్కువగా. ఈ ఆప్షన్ ఆన్ చేయగానే ఫోన్‌లోని వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు అన్నీ స్తంభించిపోయాయి. అయితే, విమానాల్లోనే కాకుండా ఫ్లైట్‌మోడ్‌తో ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

ఫ్లైట్‌మోడ్ ముఖ్య ఉద్దేశం ఇదే:

మన స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లైట్‌మోడ్ అనేది ఒక ప్రత్యేక ఫీచర్. దీన్ని ఆన్ చేస్తే, ఫోన్‌లోని సెల్యులార్ నెట్‌వర్క్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ సిగ్నల్స్ వంటివి వెంటనే నిలిచిపోతాయి. ఈ ఫ్లైట్‌మోడ్‌ను విమాన ప్రయాణంలోనే ఎక్కువగా ఫ్లైట్ నావిగేషన్ వ్యవస్థలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వాడుతారు. ఫ్లైట్ జర్నీలో ఫోన్ సిగ్నల్స్ వల్ల విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌కి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఫ్లైట్‌మోడ్ ఆన్ చేయడం వల్ల అన్ని వైర్‌లెస్ సిగ్నల్స్‌ను ఒకేసారి ఆఫ్ చేసి, మొబైల్‌ను ఆఫ్‌లైన్ మోడ్‌లోకి మార్చడం. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో బ్యాటరీని కూడా ఆదా చేయడం, లేదా సిగ్నల్స్ అవసరం లేని పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం ఫ్లైట్‌మోడ్‌ను వాడుతారు.

మరిన్ని ప్రయోజనాలు:

Advertisement

కొన్నిసార్లు ఈ ఫ్లైట్‌మోడ్ ఆన్ చేయడం ద్వారా.. సిగ్నల్ సెర్చ్ ఆపివేయడం వల్ల ఫోన్‌లోని బ్యాటరీ ఎక్కువ సేపు వినియోగంలో ఉంటుంది. అంతేకాకుండా.. కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ రాకుండా పని మీద శ్రద్ధ పెట్టవచ్చు. మరో విషయం ఏమిటంటే.. ఫోన్‌ను ఫ్లైట్‌మోడ్‌లో పెట్టి ఛార్జ్ చేస్తే.. మాములు కంటే కాస్త త్వరగా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఫోన్ సిగ్నల్స్ ఆఫ్ అవడం వల్ల తాత్కాలికంగా మన చుట్టూ రేడియేషన్ స్థాయి తగ్గుతుంది. అలాగే, ఇదివరకు చెప్పినట్లుగా ఫ్లైట్ జర్నీలో ఎలాంటి సాంకేతిక అంతరాయం లేకుండా సురక్షిత ప్రయాణం చేయవచ్చు.

డిజిటల్ డీటాక్స్‌గానూ:

ఈ స్మార్ట్‌ఫోన్స్ ప్రజల సమయాన్ని పూర్తిగా హరించివేస్తోంది. ఈ పరిస్థితిలో సోషల్ మీడియా వాడకం లేదా స్మార్ట్‌ఫోన్ వాడకం నుండి విముక్తి పొందాలనుకునే వారికి, వారి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలనుకునే వారికి ఫ్లైట్‌మోడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్స్‌లోని ఫ్లైట్‌మోడ్‌ను నెట్‌వర్క్ ట్రబుల్షూటింగ్‌కు మాత్రమే కాకుండా ఈ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చని గమనించాలి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×