// // NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే.. -->
E-Paper
Advertisement

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..
Advertisement

NSUT Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఎస్‌యూటీ)లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్ డీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, వయస్సు తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఎస్‌యూటీ) లో 184 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 11న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 184

నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్ డీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 35 ఏళ్ల వయస్సు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 6
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 11

ఉద్యోగాలు – వెకెన్సీలు:

అసోసియేట్ ప్రొఫెసర్: 126 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 50 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడబ్ల్యూబీడీ): 6 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్ (పీడబ్ల్యూబీడీ): 2 పోస్టులు

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 జీతం ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు రూ.1,31,400 నుంచి రూ.2,17,100 జీతం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: మెరిట్, అభ్యర్థి పని తీరును బట్టి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://nsut.ac.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 184

దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 11

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×