E-Paper
Advertisement

Adobe Photoshop: ఏడాదిపాటు ఉచితంగా అడోబ్‌ ఫొటోషాప్‌.. డౌన్లోడ్ చేసుకోకుండానే ఆన్‌లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు!

Adobe Photoshop: ఏడాదిపాటు ఉచితంగా అడోబ్‌ ఫొటోషాప్‌.. డౌన్లోడ్ చేసుకోకుండానే ఆన్‌లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు!
Advertisement

Adobe Photoshop: ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ఫొటో ఎడిటింగ్‌ టూల్‌ అడోబ్‌ ఫొటోషాప్‌. రోజురోజుకు మారుతున్న నేటి ఆధునిక యుగంలో అనేక కొత్త టూల్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. అయినా కూడా అడోబ్ ఫొటోషాప్‌కు ఉన్నంత ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పుడీ ఫొటోషాప్‌ ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ రూపంలో లభిస్తున్న ఈ టూల్‌ను డబ్బులు కట్టకుండానే ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. దీని కోసం ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్‌ చేయాల్సిన అవసరం కూడా లేదు. అడోబ్ ఫొటోషాప్ ముఖ్యమైన ఎడిటింగ్‌ ఫీచర్లన్నీ ఈ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా లభిస్తుంది. మరి ఏడాదిపాటు అడోబ్ ఫొటోషాప్‌ను ఉచితంగా ఎలా పొందాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందామా..

12 నెలల ఫ్రీ సర్వీస్:

ఉచిత సర్వీసులను వాడుకోవాలంటే.. ముందుగా గూగుల్‌ క్రోమ్‌ ఫొటోషాప్‌ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఒకసారి డౌన్లోడ్‌ చేసుకున్నాక నేరుగా బ్రౌజర్‌లోనే ఫొటోషాప్‌ను వినియోగించుకోవచ్చు. అయితే, 2025 డిసెంబరు 8వ తేదీలోపు ఈ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి 12 నెలల పాటు ఉచిత యాక్సెస్‌ను అడోబ్ కంపెనీ అందిస్తోంది. అలాగే ఈ టూల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ద్వారా మరింత మెరుగుపరుస్తామని, కొత్త ఫీచర్లను జోడిస్తామని సంస్థ తెలిపింది. డబ్బులు కట్టకుండా ఆన్‌లైన్‌లో లైట్‌ వెయిట్‌ ఎడిటింగ్‌ టూల్స్‌ కోసం చూసేవాళ్లు ఇలాంటి  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది.

డౌన్‌లోడ్ ఇలా..

Advertisement

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో photoshop chrome extension అని సెర్చ్‌ చేసి ఎక్స్‌టెన్షన్‌ సేవలను పొందవచ్చు. లేదా క్రోమ్‌ వెబ్‌స్టోర్‌లోకి వెళ్లి ఫొటోషాప్‌ ఎక్స్‌టెన్షన్‌ను మీ బ్రౌజర్‌కు జోడించుకునే అవకాశం కూడా ఉంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ టూల్‌లో బ్యాగ్రౌండ్‌ రిమూవల్‌, కలర్‌ అండ్‌ ఎక్స్‌పోజర్‌ అడ్జెస్ట్‌మెంట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా మనకు కావాల్సిన డైమెన్షన్లలో ఇమేజ్‌లను క్రాప్‌ చేసుకునే సదుపాయాన్ని అడోబ్ ఫొటోషాప్‌ అందిస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×