E-Paper
Advertisement

Goa Night Club Fire: గోవా నైట్ క్లబ్ ఘటనలో.. షాకింగ్ విషయాలు, నిప్పు మొదలైన వీడియో ఇదిగో

Goa Night Club Fire: గోవా నైట్ క్లబ్ ఘటనలో.. షాకింగ్ విషయాలు, నిప్పు మొదలైన వీడియో ఇదిగో
Advertisement

Goa Night Club Fire: గోవా నైట్ క్లబ్ ఘటనలో తప్పెవరిది? పర్మిషన్ ఇచ్చింది పర్యాటక శాఖదా? అనుమతులు ఉల్లంఘించిన క్లబ్ ఓనర్‌దా? మంటలు ఎగిసిపడడటానికి కారణం అదేనా? ఘటనకు ముందు అసలేం జరిగింది? ఘటన జరుగుతున్నప్పుడు ఎందుకు అలర్ట్ కాలేకపోయారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

గోవా నైట్ క్లబ్ ఘటనలో షాకైన నిజాలు

Advertisement

దేశంలోని చాలా రాష్ట్రాలు పర్యాటకంపై దృష్టి సారిస్తున్నాయి. చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు అటువైపు మొగ్గు చూపుతున్నాయి. నిబంధనలు ఏ మాత్రం ఉల్లఘించిన గోవా లాంటి ఘటనలు పునరావృతమవుతాయి. తాజాగా నార్త్ గోవా అర్పోరాలో ప్రాంతంలోని ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ ఓ నైట్‌క్లబ్‌లో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది.

ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి ఒంటి సమయంలో ఫ్లోర్‌పై డ్యాన్సర్లు 100 మందికి పైగా ఉన్నారు. కొంతమంది హుషారైన పాటలకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తున్నారు. నైట్ క్లబ్ అలంకరణలో ఉపయోగించిన తాటాకులకు తొలుత మంటలు అంటుకున్నాయి.

Advertisement

నిప్పు మొదలైంది అక్కడే, ఇదిగో వీడియో

ఆ సమయంలో స్టేజీపై ఉన్న మ్యూజికల్ టీమ్ లోని కొందరు సిబ్బంది మంటలను కళ్లతో చూశారు. ఆ తర్వాత డీజే ప్రాంతంలోని ఉన్న సిబ్బంది నిప్పురవ్వలు పడ్డాయి. అది క్రమంలో పెరిగిపోయింది. వెంటనే డ్యానర్స్ తన నృత్యాన్ని ఆపేసింది. అలంకరణకు తాటాకులను ఉపయోగించడంతో క్షణాల వ్యవధిలో ఓ వైపు మంటలు, మరోవైపు పొగ ఆ ప్రాంతాన్ని చుట్టి ముట్టింది.

అక్కడి నుంచి మ్యూజికల్ టీమ్ లోని సభ్యులు తమ పరికరాలను తీసుకుని బయటకు పరుగులు పెట్టడం కనిపించింది. దీనికి సంబంధించి ఓ వీడియోలో వెలుగులోకి వచ్చింది.  కనిపిస్తున్న చిన్నచిన్న మంటలు లైటుగా తీసుకోవడం వల్లే ఇంత ఘోరమైన విషాదం చోటు చేసుకుంది.

ALSO READ: ఆఫీసు తర్వాత ఉద్యోగులు విసిగించొద్దు, లోక్‌సభలో కొత్త బిల్లు

నైట్‌క్లబ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ప్రకారం వివరాలు మేరకు ప్రమాదం జరిగినప్పుడు ‘బాలీవుడ్ బ్యాంగర్ నైట్’ నిర్వహిస్తోంది. నైట్‌క్లబ్ తనను తాను ‘ఐలాండ్ క్లబ్’గా ప్రచారం చేసుకున్నారు.అర్పోరా నది బ్యాక్‌ వాటర్స్‌ సమీపంలో నైట్ క్లబ్‌ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీని ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు చాలా చిన్నవి.

ఘటన జరిగి సమాచారం అందుకుని ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగలో చిక్కుకున్న తర్వాత ఊపిరాడక చాలా మంది మృతి చెందారు. ఫలితంగా ఊహించని విషాదం జరిగింది.

క్లబ్‌ నిర్వాహకుల మధ్య వివాదాలు ఉన్నాయని, కేవలం డబ్బులకు ఆశపడడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానిక సర్పంచ్‌ చెప్పాడు. క్లబ్ నిర్వాహకులు ఒకరిపై మరొకరు పంచాయితీలో ఫిర్యాదు చేసుకున్నారని గుర్తు చేశారు. క్లబ్‌ కూల్చివేతకు నోటీసులు ఇచ్చామని, కొంత మంది అధికారులు దాన్ని అడ్డుకున్నట్లు వివరించారు.

మృతి చెందిన 25 మందిలో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. మిగతా ఏడుగురు గుర్తింపు ఇంకా నిర్ధారించలేదు. మరణించినవారిలో జార్ఖండ్, అస్సాం నుంచి ఉద్యోగల కోసం అక్కడికి వచ్చారు. మిగతావారి మృతదేహాలను గుర్తించడానికి ఒక రోజు పడుతుందని ఆ తర్వాత వారి బంధువులకు అప్పగిస్తామని సీనియస్ పోలీసు అధికారి తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×