E-Paper
Advertisement

New Acerpure ACs: ఏసర్‌ప్యూర్ చిల్ నియో ఏసీలు లాంచ్.. ఒకసారి ఆన్ చేస్తే.. దుప్పటి కప్పుకోవాల్సిందే!

New Acerpure ACs: ఏసర్‌ప్యూర్ చిల్ నియో ఏసీలు లాంచ్.. ఒకసారి ఆన్ చేస్తే.. దుప్పటి కప్పుకోవాల్సిందే!
Advertisement

New Acerpure ACs: ప్రముఖ టెక్ కంపెనీ ఏసర్ అనుబంధ సంస్థ అయిన ఏసర్ ప్యూర్ తన లేటెస్ట్ మోడల్ ఏసీలను భారత్ లో లాంచ్ చేసింది. ‘చిల్ నియో’ సిరీస్ (Chill Neo split inverter air conditioner)నుంచి ఇన్వర్టర్ ఏసీ లను భారత్ లో విడుదల చేసింది. వేసవి కాలంలో ఉండే కఠినమైన పరిస్థితులను తట్టుకొని.. అహ్లాదకరమైన చల్లదనాన్ని ఇవి అందిస్తాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

7 వేరియంట్లలో లాంచ్..

ISEER 2026 నిబంధనలకు అనుగుణంగా ఏసర్ ప్యూర్ తన నియో చిల్ సిరీస్ ను తీసుకొచ్చింది. సామర్థ్యం, స్టార్ రేటింగ్స్ అనుగుణంగా ఏడు మోడల్స్ గా ఏసీలను తీర్చిదిద్దింది. బెడ్ రూమ్, లివింగ్ రూమ్, గది విస్తీర్ణానికి అనుగుణంగా ఈ ఏసీల సామర్థ్యాన్ని విభజించారు. ఏసీల ప్రారంభ ధరను రూ.29,990గా నిర్ణయించారు. మెరుగైన కూలింగ్, విద్యుత్ ఆదాను కోరుకునే వారు.. ప్రీమియం మోడల్ ను పరిశీలించవచ్చని కంపెనీ వర్గాలు సూచించాయి.

58°C వద్ద కూడా కూలింగ్

Advertisement

నియో చిల్ ఏసీల్లో కొన్ని ఫీచర్లు హైలెట్ గా నిలుస్తున్నాయి. సాధారణ ఏసీలు.. బయటి ఉష్ణోగ్రత 45-48 డిగ్రీలు దాటితే కూలింగ్ ను తగ్గించేస్తాయి. కానీ నియో చిల్ మాత్రం 58 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత వద్ద కూడా సమర్థవంతంగా కూలింగ్ ను అందించగలదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలోని 7-in-1 కన్వర్టబుల్ మోడ్ సాయంతో గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్య, అవసరాన్ని బట్టి 7 రకాలుగా కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు.

Also Read: Xiaomi Water Purifier: 7 ఏళ్ల వరకు నడిచే కొత్త RO వాటర్ ప్యూరిఫైయర్ లాంచ్ చేసిన షావోమీ.. ధర ఎంతంటే?

అత్యంత వేగంగా కూలింగ్

Advertisement

ఏసర్ ప్యూర్ లోని ఐస్ బ్లాస్ట్ మోడ్ ను సైతం కంపెనీ వర్గాలు హైలెట్ చేస్తున్నారు. దీనిని ఒకసారి ఆన్ చేస్తే.. అత్యంత వేగంగా గదిని చల్లబరుస్తుందని పేర్కొంటున్నాయి. అలాగే దీని సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ దుమ్ము, దూళిని తొలగించి స్వచ్ఛమైన చల్లగాలిని ప్రసారం చేస్తుందని, 100% కాపర్ కాయిల్ మెరుగైన కూలింగ్, మన్నిక అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిలోని బీఎల్డీసీ (BLDC) మోటార్.. శబ్దాన్ని తగ్గించడటంతో పాటు విద్యుత్ ను ఆదా చేస్తుందని స్పష్టం చేసింది.

Also Read: Mahindra BE.07: వచ్చే ఏడాది నెక్ట్స్ ఈవీ లాంచ్.. కీలక ప్రకటన చేసిన మహీంద్రా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×