E-Paper
Advertisement

Upcoming Sedans 2026: హ్యుందాయ్ To స్కోడా.. ఈ ఏడాదిలో లాంచ్ కాబోయే క్రేజీ సెడాన్ కార్లు!

Upcoming Sedans 2026: హ్యుందాయ్ To స్కోడా.. ఈ ఏడాదిలో లాంచ్ కాబోయే క్రేజీ సెడాన్ కార్లు!
Advertisement

Upcoming Sedans in India 2026: ఇండియన్ కార్ల మార్కెట్లోకి సరికొత్త సెడాన్లు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా స్కోడా, వోక్స్‌ వ్యాగన్, హ్యుందాయ్, హోండా, మెర్సిడెస్ బెంజ్ లాంటి ఆటోమేకర్లు కొత్త కార్లను పరిచయం చేయబోతున్నాయి. రాబోయే నెలల్లో విడుదలకాబోతున్న సెడాన్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ వెర్నా కోసం మిడ్ సైకిల్ అప్‌ డేట్‌ ను రెడీ చేస్తోంది. మరికొద్ది నెలల్లోనే ఈ కారు లాంచ్ కాబోతోంది. గ్లోబల్ మోడళ్లలో కనిపించేలా లేటెస్ట్ కర్వ్డ్ ట్విన్ స్క్రీన్ సెటప్‌ తో క్యాబిన్ రూపొందనుంది. రీ డిజైన్ చేసిన స్టీరింగ్ వీల్ రానుంది.  స్పై షాట్లు సవరించిన ఫ్రంట్ ఫాసియాను సూచిస్తున్నాయి. వెనుక వైపు మార్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

⦿ మెర్సిడెస్ బెంజ్ CLA EV

Advertisement

మెర్సిడెస్ బెంజ్ పూర్తి ఎలక్ట్రిక్ CLA రెండు నెలల్లో భారతీయ మార్కెట్ లోకి అడుగు పెడుతుందని వెల్లడించింది. ఈ కారు ధర రూ. 62 లక్షలు(ఎక్స్ షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. ఇండియా స్పెక్ మోడల్ 85 kWh బ్యాటరీ ప్యాక్ తో  ఇతర దేశాల్లో అమ్ముతున్న CLA 250+ డ్రాప్ పవర్‌ ను లాగే ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఒకే ఛార్జ్‌ పై 792 కి.మీ వరకు ప్రయాణించనుంది.

⦿ వోక్స్‌ వ్యాగన్ వర్టస్ ఫేస్‌ లిఫ్ట్

ఈ సంవత్సరం వినియోగదారులు ఆసక్తిగా చూస్తున్న మోడల్ ఇది. వోక్స్‌ వ్యాగన్ వర్టస్ కోసం మిడ్ లైఫ్ రిఫ్రెష్ ను అందించబోతోంది. ఈ సెడాన్ చిన్న చిన్ని ఎక్స్ టీరియర్ ట్వీక్‌ లను పొందుతుంది. అప్‌ గ్రేడ్ చేయబడిన ఇంటీరియర్‌ తో ఉంటుంది. హుడ్ కింద పెద్దగా మార్పులు ఉండవని తెలుస్తోంది. వర్టస్ 1.0 లీటర్, 1 5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లతో రాబోతున్నట్లు సమాచారం. 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వెర్షన్ లోనూ రానున్నట్లు తెలుస్తోంది.

⦿ కొత్త స్కోడా స్లావియా

Advertisement

వర్టస్‌ తో అండర్‌ పిన్నింగ్స్‌ ను పంచుకునే స్కోడా స్లావియా కూడా 2026లో మిడ్ లైఫ్ రిఫ్రెష్ కోసం లైన్ లో ఉంది. ఇందులో రీడిజైన్ చేసిన ఫ్రంట్ ప్రొఫైల్, వెనుక డిజైన్‌ లో చిన్న మార్పులు ఉంటాయి. క్యాబిన్ ఇటీవల రిఫ్రెష్ చేయబడిన కుషాక్ మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. మెకానికల్ విషయానికి వస్తే పెద్దగా మార్పులు ఏవీ ఉండకపోవచ్చు. ఈ కారు ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ తో కూడా వచ్చే అవకాశం ఉంది.

⦿ కొత్త హోండా సిటీ

హోండా 2026 చివరలో కొత్త హోండా సిటీతో రానుంది. ఇది 2023లో ఇప్పటికే ఫేస్‌ లిఫ్ట్‌ తో అడుగు పెట్టింది. రాబోయే కారు మరిన్ని అప్ డేట్స్ తో రానుంది. క్యాబిన్ కొత్తగా రీఫ్రెష్ చేయబడి ఉంటుంది. సవరించిన ట్రిమ్ ఎలిమెంట్స్, ఎంపిక చేసిన కొత్త ఫీచర్లు జోడించబడతాయని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

Read Also: వచ్చే ఏడాది నెక్ట్స్ ఈవీ లాంచ్.. కీలక ప్రకటన చేసిన మహీంద్రా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×