E-Paper
Advertisement

AC vs Air Cooler: ఏసీ కొంటే బెటరా? లేదా కూలర్ మంచిదా? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

AC vs Air Cooler: ఏసీ కొంటే బెటరా? లేదా కూలర్ మంచిదా? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?
Advertisement

AC vs Air Cooler: వేసవి కాలం రాగానే ఏసీలు, కూలర్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. భానుడి భగభగల నుంచి తప్పించుకొని ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏసీ లేదా కూలర్ కొనుగోలు చేసే విషయంలో మధ్యతరగతి ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. రేటు ఎక్కువ పెట్టి ఏసీ కొనాలా? లేదా కూలర్ తో సరిపెట్టుకోవచ్చా? అన్న సందేహాం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫీచర్ల పరంగా ఏసీ, కూలర్ మధ్య తేడాలు? ఫైనల్గా ఏది కొంటే బెటర్ అన్నది ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఏసీ – కూలర్ వర్కింగ్ స్టైల్..

సాధారణంగా కూలర్లు ‘ఎవాపరేటివ్ కూలింగ్’ (Evaporative Cooling) ఫార్ములాతో పనిచేస్తాయి. వేడి గాలి తడిచిన ప్యాడ్‌ల గుండా వెళ్లినప్పుడు నీరు ఆవిరై గాలిని చల్లబరుస్తుంది. తద్వారా కూలింగ్ గదికి వ్యాపిస్తుంది. మరోవైపు ఏసీలు మాత్రం రిఫ్రిజిరేషన్ ప్రాసెస్ ద్వారా పనిచేస్తాయి. గదిలోని వేడిని బయటకు పంపి కెమికల్ రిఫ్రిజెరెంట్ (Refrigerant) ద్వారా గాలిని చల్లబరుస్తాయి. అనంతరం చల్లగాలిని గదిలోకి పంపిస్తాయి.

విద్యుత్ ఖర్చు

Advertisement

ఏసీతో పోలిస్తే కూలర్లు చాలా తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. ఏసీలు 100 శాతం పవర్ యూజ్ చేసుకుంటే అందులో కూలర్లు 20 శాతం మాత్రమే పవర్ వాడుకుంటాయి. పైగా ఏసీతో పోలిస్తే కూలర్లు అందుబాటులో ధరల్లోనే ఉంటాయి. కాబట్టి మిడిల్ క్లాస్ వారు ఈజీగానే కొనుగోలు చేయవచ్చు. మరోవైపు ఏసీలు అధికంగా విద్యుత్ ను వినియోగించడం వల్ల పవర్ బిల్లు భారీగా వస్తుంది.

క్లైమెట్‌ను బట్టి పనితీరు

ఎయిర్ కూలర్లు.. పొడి వాతావరణం ఉన్న చోట అద్భుతంగా పనిచేస్తాయి. కానీ తీర ప్రాంతాల్లో లేదా ఉక్కపోత (Humidity) ఎక్కువగా ఉన్నప్పుడు ఇది అంత ప్రభావవంతంగా అనిపించదు. అటు ఏసీలను అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇవి గాలిలోని తేమను తొలగించి.. ఉక్కపోత నుండి ఉపశమనం కలిగిస్తాయి.

మెయింటెనెన్స్ పరంగా..

Advertisement

ఎయిర్ కూలర్ నుంచి చల్లదనం పొందేందుకు ప్రతిరోజూ నీటిని నింపాల్సి ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా వాటర్ ట్యాంక్, కూలింగ్ ప్యాడ్‌లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. లేదంటే దుర్వాసన, బ్యాక్టీరియా వ్యాప్తి పెరిగి అనారోగ్యానికి గురికావొచ్చు. అయితే ఏసీలకు నీటిలో ఎలాంటి అవసరం ఉండదు. సంవత్సరానికి ఒకట్రెండు సార్లు ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయిస్తే సరిపోతుంది.

Also Read: LPG Statistics: దేశంలో గ్యాస్ సంక్షోభం.. LPG గురించి.. ఆశ్చర్యపరిచే వాస్తవాలు!

ఏది ఎంచుకుంటే బెటర్?

తక్కువ బడ్జెట్ ఉండి విద్యుత్ బిల్లు ఆదా కోరుకుంటే కూలర్ ను బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. సముద్ర తీరానికి దూరంగా ఉండి, పొడి వాతావరణంలో జీవిస్తున్నట్లైతే కూలర్ ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది. అలా కాకుండా మీరు బెటర్ కూలింగ్, ప్రతీసారి నీరు నింపే శ్రమ లేకుండా ఉండాలని కోరుకుంటే నేరుగా ఏసీని కొనుగోలు చేయవచ్చు. పైగా కూలర్ తో పోలిస్తే ఏసీలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. చల్లదనం విషయంలోనూ ఏసీదే స్పష్టమైన పైచేయిగా నిలుస్తుంది. బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్య లేదనుకుంటే మాత్రం ఏసీని కొనుగోలు చేయడమే ఉత్తమమని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Haier vs LG Fridge: మిడిల్ క్లాస్ మెచ్చిన బ్రాండ్స్.. డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లలో.. ఏది బెస్ట్ ఆప్షన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×