// // Poha egg Recipe - ఎగ్ పోహా రెసిపీ.. ప్రొటీన్ నిండిన బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -->
E-Paper
Advertisement

Poha egg Recipe: ఎగ్ పోహా రెసిపీ.. ప్రొటీన్ నిండిన బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

Poha egg Recipe: ఎగ్ పోహా రెసిపీ.. ప్రొటీన్ నిండిన బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
Advertisement

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ నిండిన ఆహారాలు తప్పనిసరి. కానీ బిజీ లైఫ్‌లో ఎక్కువ సమయం తీసుకునే వంటకాలు చేయడం కష్టమే. అలాంటి సమయంలో సింపుల్‌గా, తక్కువ సమయంలో తయారయ్యే ఎగ్ పోహా వండుకోవడం మంచిది. పోహా (అటుకులు) తేలికపాటి ఆహారం. దీనికి గుడ్లు కలిస్తే ఇది పూర్తి ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్‌గా మారుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ వంటకం రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

ఎగ్ పోహా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పోహా (అటుకులు) – 1 కప్పు
గుడ్లు – 2
ఉల్లిపాయ – 1 (చిన్న ముక్కలు)
టమాట – 1
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – కొద్దిగా
పల్లీలు – 2 స్పూన్లు
ఆవాలు, జీలకర్ర – తగినంత
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – 1 స్పూన్
కొత్తిమీర – ఒక స్పూను

Advertisement

Also read: Acne Foods: రైస్ vs రోటి.. మొటిమలు తగ్గాలంటే ఈ రెండింటిలో ఏది తింటే మంచిది?

ఎగ్ పోహా రెసిపీ
1. మొదట పోహాను శుభ్రంగా కడిగి నీరు వంపేయాలి. ఇప్పుడు దానికి కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలిపి 5 నిమిషాలు ఉంచాలి. ఇలా చేస్తే పోహా మెత్తగా, రుచిగా ఉంటుంది.
2. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పల్లీలు వేసి వేయించాలి.
3. ఆ తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
4. ఇప్పుడు టమాట ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు కలుపుతూ ఉంచాలి.
5. తరువాత గుడ్లను కొట్టి అందులో కలిపి బాగా వేయించాలి.
6. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన పోహాను ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉంచాలి.
7. అన్ని పదార్థాలు బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి గార్నిష్ చేస్తే రుచికరమైన ఎగ్ పోహా రెడీ అవుతుంది.

Advertisement

Also read: Salary tips: జీతం వచ్చిన వెంటనే ఇలా చేస్తే డబ్బు కొరత ఉండదు

ఈ ఎగ్ పోహా కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, పోషకాలతో నిండిన బ్రేక్‌ఫాస్ట్ కూడా. గుడ్లలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. పోహా కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది. పల్లీలు, కూరగాయలు ఫైబర్, మంచి కొవ్వులు అందిస్తాయి. ఈ విధంగా ఒకే వంటకంలో అన్ని పోషకాలు లభిస్తాయి.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×