E-Paper
Advertisement

పురుగులు అయిపోయాయ్.. ఇప్పుడేమో ‘అవి’.. వందే భారత్ ఫుడ్‌లో ఏంటీ చెత్త?

పురుగులు అయిపోయాయ్.. ఇప్పుడేమో ‘అవి’.. వందే భారత్ ఫుడ్‌లో ఏంటీ చెత్త?
Advertisement

Vande Bharat Food Controversy: ప్రీమియం రైలు వందే భారత్ స్లీపర్ రైలులో అందించిన భోజనం విషయంలో తాజాగా మరో వివాదం తలెత్తింది. ఓ ప్రయాణికుడు తనకు వడ్డించిన ఆహారంలో చిన్న మెటల్ ముక్క వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ప్రీమియం రైళ్లలో ఆహార భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

పప్పులో ఇనుమ ముక్క!

జేఎస్‌కే ట్రావెలాగ్ అనే పేరుతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఒక ట్రావెల్ వ్లాగర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆయన చెప్పిన  వివరాల ప్రకారం.. 27576 నంబర్ గల వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాత్రి భోజనం చేస్తుండగా పప్పులో ఒక చిన్న మెటల్ ముక్క కనిపించిందట. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి ఆయన ఎక్స్ లో షేర్ చేశారు. అంతేకాదు, ప్రీమియం రైల్లో ఫుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. “నేను భోజనం చేసే సమయంలో నా పళ్ల మధ్యకి ఈ మెటల్ ముక్క వచ్చింది. నేను తీసి చూసి షాకయ్యాను. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ప్రశ్నించారు. సిబ్బంది భోజనం మార్చి ఇస్తామని చెప్పినప్పటికీ, ఒకవేళ ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

Advertisement

అంతేకాదు,  తన ఆరోపణ నిజమని నిరూపించేందుకు ఫోటోలు కూడా షేర్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇతర ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పుకొచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ విషయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వందే భారత్ రైళ్లు సాధారణంగా ఆధునిక సౌకర్యాలు, మెరుగైన సేవలు, క్వాలిటీ ఫుడ్ అందిస్తాయి. కానీ, రీసెంట్ గా వెలుగులోకి వస్తున్న పలు ఘటనలు ఆ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం రైళ్లలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే, ఆహార నాణ్యతపై మరింత కఠినమైన తనిఖీలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

స్పందించిన ఐఆర్‌సిటిసి అధికారులు

అటు ఈఘటనపై ఐఆర్‌సిటిసి అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు వెల్లడించారు. “మీ ఫిర్యాదు మాకు అందింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాము” అని ఎక్స్ వేదికగా వెలలడించారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకొని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  వందేభారత్ ఫుడ్ కు సంబంధించి గతంలో కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఆహారంలో పురుగులు వచ్చినట్లు ప్రయాణీకులు వెల్లడించారు. దీంతో రైల్వే క్యాటరింగ్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఈ ఘటనతోనైనా రైలులో ఆహార భద్రతను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉదంటున్నారు ప్రయాణీకులు.

Read Also:  ట్రైన్ ఫుడ్ తింటున్నారా? ఈ వీడియో చూసాక జీవితంలో ఆ ఆలోచన రాదు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×