E-Paper
Advertisement

రోడ్డు మీద ఉండే వైట్, యెల్లో లైన్స్ అర్థం ఏంటి? ప్రతి డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

రోడ్డు మీద ఉండే వైట్, యెల్లో లైన్స్ అర్థం ఏంటి? ప్రతి డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Advertisement

Road Markings Explained: ప్రతిరోజూ మనం రోడ్లపై ప్రయాణిస్తుంటాం. డ్రైవ్ చేస్తున్న సమయంలో ఎన్నో గీతలు, గుర్తులు కనిపిస్తాయి. అయితే, అర్థం ఏమిటో చాలా మందికి  తెలియదు. నిజానికి, ఈ గీతలు కేవలం రోడ్డుపై గీసిన రంగులు కాదు. డ్రైవర్లకు ఎప్పుడు వెళ్లాలి, ఎక్కడ ఆగాలి, ఎలా నడపాలి అనే విషయాలను చెప్పే సూచనలు. వీటిని పట్టించుకోకుండా చేసే చిన్న తప్పిదాలు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. ఇప్పటి ట్రాఫిక్ పరిస్థితుల్లో ఈ రోడ్ మార్కింగ్స్ ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. తప్పుగా ఓవర్‌ టేక్ చేయడం, అకస్మాత్తుగా లేన్ మార్చడం, బ్రేక్ వేయడం లాంటి సమస్యలు ఎక్కువగా ఈ గీతలను పట్టించుకోకపోవడం వల్లే జరుగుతాయి. సో, ప్రతి డ్రైవర్‌కు వీటి గురించి అవగాహన కలిగి ఉండాలి.

గుర్తుల వెనుక అర్థాలు ఇవే!

⦿ విరిగినట్లుగా ఉండే  వైట్ లైన్ ఉంటే.. ఒకే దిశలో వెళ్లే వాహనాలను వేర్వేరు లేన్లుగా విభజిస్తుంది. ఈ గీత ఉన్నప్పుడు మీరు లేన్ మార్చుకోవచ్చు.  కానీ, ఇతర వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని భావించినప్పుడే చేయాలి. సాధారణంగా హైవేలు, పెద్ద రోడ్లపై  ఈ గీతలు కనిపిస్తాయి.

Advertisement

⦿ ఇక విరిగినట్లుగా కాకుండా పూర్తి తెల్ల గీత ఉంటే, అది మీ లేన్‌ లోనే ఉండాలని సూచిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దాటాలి. లేకపోతే దాన్ని దాటకపోవడం మంచిది. అలా కాకుండా ఒకదాని పక్కన మరో తెలుపు గీతలు రెండూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ లేన్ మార్చ కూడదు. సాధారణంగా మలుపులు, ప్రమాదకర ప్రదేశాల దగ్గర వీటిని వేస్తారు.

⦿ పసుపు గీతలు సాధారణంగా రెండు దిశల ట్రాఫిక్ ఉన్న రోడ్లపై ఉంటాయి. బ్రోకెన్ యెల్లో గీత ఉంటే, సేఫ్ గా ఓవర్‌ టేక్ చేయవచ్చు. కానీ, స్ట్రాంగ్ పసుపు గీత ఉంటే, ఓవర్‌ టేక్ చేయకూడదు. ఎందుకంటే ముందున్న రోడ్డు స్పష్టంగా కనిపించకపోవచ్చు. రెండు స్ట్రాంగ్ పసుపు గీతలు ఉంటే అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌ టేక్ చేయకూడదు.

Advertisement

⦿ జీబ్రా క్రాసింగ్ కూడా చాలా ముఖ్యమైన గుర్తు. ఇది పాదచారులు రోడ్డు దాటడానికి ఉపయోగించుకునేలా ఏర్పాటు చేస్తారు. ఎవరైనా రోడ్డు దాటడానికి ఎదురు చూస్తే డ్రైవర్ తప్పనిసరిగా ఆగాలి. కానీ, చాలా సందర్భాల్లో ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేస్తారు.

⦿ సిగ్నల్ దగ్గర కనిపించే స్టాప్ గీత కూడా చాలా ముఖ్యమైనది. వాహనాన్ని ఈ లైన్ ముందు ఆపాలి. దానిని దాటితే పాదచారులకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుంది.

⦿ రోడ్డు మీద షెవ్రాన్ గుర్తులు కూడా ఉంటాయి. ఇవి సాధారణంగా డివైడర్లు, రోడ్డు మలుపుల దగ్గర కనిపిస్తాయి. ఈ గుర్తులు ఉన్న ప్రదేశాల్లో వాహనాలు వెళ్లకూడదు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రదేశాల్లో వేస్తారు.

మొత్తంగా ఈ రోడ్ మార్కింగ్స్ డ్రైవింగ్‌ ను సురక్షితంగా, క్రమబద్ధంగా ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుని పాటించడం వల్ల ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది.

Read Also: స్లీపర్ బస్సులు బ్యాన్.. ఏపీ సర్కారు సంచలన నిర్ణయం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×