E-Paper
Advertisement

స్కూల్లో ఏడిపించేవారి తుక్కురేగ్గొడితే ? ఈ పిల్లాడి చితక్కొట్టుడుకు ఫిదా అయిపోతారు

స్కూల్లో ఏడిపించేవారి తుక్కురేగ్గొడితే ? ఈ పిల్లాడి చితక్కొట్టుడుకు ఫిదా అయిపోతారు
Advertisement

Netflix Trending Series : నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ లైవ్-యాక్షన్ సిరీస్ ‘Viral Hit’. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూత్‌ ను ఆకర్షిస్తోంది ఈ సిరీస్. ప్రముఖ సౌత్ కొరియన్ వెబ్‌టూన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ స్కూల్ వేధింపులు, సోషల్ మీడియా క్రేజ్, మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ వంటి అంశాల కలయికతో అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. మరి ఈ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కోటా షిమురా ఇందులో మన హీరో. అతను సాధారణ హైస్కూల్ విద్యార్థి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, హాస్పిటల్‌లో ఉన్న తల్లి వైద్య ఖర్చులు, స్కూల్లో క్లాస్‌మేట్స్ చేసే దౌర్జన్యాలు… ఇలా అతని జీవితం ఒక్కో రోజు ఒక్కో గండం అన్నట్టుగా ఉంటుంది. అతనికి ఎదిరించడం రాదు, అందరికీ తల వంచి జీవితం గడుపుతాడు. ఒకరోజు స్కూల్ రౌడీతో షిమురా అనుకోకుండా జరిగిన ఒక చిన్న గొడవ, ఇంటర్నెట్‌లో లైవ్ స్ట్రీమ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆ ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే అతనికి భారీ ఫాలోయింగ్, వ్యూస్, డబ్బు వస్తాయి.

Advertisement

దీంతో ఊహించని విధంగా వచ్చి పడిన ఫేమ్ తో గొడవలు చేసి డబ్బు సంపాదించవచ్చని గ్రహిస్తాడు షిమురా. తన స్నేహితులతో కలిసి “వైరల్ హిట్” అనే ఆన్‌లైన్ వీడియో ఛానెల్‌ని ప్రారంభిస్తాడు. కానీ ఇక్కడే ఒక సమస్య ఎదురవుతుంది. అదేంటంటే షిమురాకు అస్సలు ఫైటింగ్ రాదు. ఇంటర్నెట్‌లో దొరికిన ఒక రహస్య మార్షల్ ఆర్ట్స్ ఛానెల్ (TOU-KEI) వీడియోలను చూస్తూ రాత్రి పగలు కష్టపడి ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటాడు. తరువాత కథ మలుపు తిరుగుతుంది. స్కూల్ లో ఏడిపించే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద క్రిమినల్స్ వరకు అందరినీ లైవ్‌లో సవాల్ చేస్తూ, కొడుతూ… ఒక్కొక్క ఎపిసోడ్‌ తో షిమురా జీవితం పూర్తిగా మారిపోతుంది.

కానీ ఈ వైరల్ క్రేజ్ వెనుక కూడా ఎన్నో ప్రమాదాలు, రహస్యాలు, పగలు దాగి ఉంటాయి. షిమురా తన తల్లి వైద్యం కోసం, తన గౌరవం కోసం, తన స్నేహితుల కోసం ఎంత దూరం వెళ్లగలడు ? ఈ ప్రయాణంలో అతను ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటాడు ? అనేది తెలియాలంట సిరీస్ మొత్తం చూడాల్సిందే.

Advertisement

స్కూల్ లైఫ్, ర్యాగింగ్, సోషల్ మీడియా ప్రభావం వంటి రియల్ లైఫ్ ఇష్యూస్‌ను యాక్షన్‌తో కలిపి దర్శకుడు ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించాడు. అలాగే అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీక్వెన్స్‌లు, హ్యూమర్, ఎమోషన్, సస్పెన్స్ అన్నీ ఉండడంతో యూత్ కి పర్ఫెక్ట్ విందు లాంటిది ఈ సిరీస్. ‘వైరల్ హిట్’ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. జపనీస్ ఒరిజినల్ ఆడియోతో ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగు ఆడియో ప్రస్తుతం అందుబాటులో లేదు.

Read Also : రాయితో బాయ్ ఫ్రెండ్ తల పగలగొట్టే అమ్మాయి… ‘దృశ్యం’ రేంజ్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×