E-Paper
Advertisement

చాబహార్ పోర్టుపై అమెరికా దాడి.. షాకైన ఇరాన్, భారత్‌కి దెబ్బేనంటున్న నిపుణులు

చాబహార్ పోర్టుపై అమెరికా దాడి.. షాకైన ఇరాన్, భారత్‌కి  దెబ్బేనంటున్న నిపుణులు
Advertisement

Iran Vs America: రాత్రి నుంచి ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇరాన్ కీలక స్థావరాలపై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేస్తోంది. అటు ఇరాన్ కూడా ధీటుగా బదులిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి చేసింది. దీంతో యుద్ధం ఇప్పట్లో తగ్గడం కష్టమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇరాన్‌లోని కీలక నగరాలపై అమెరికా దాడులు-అర్ధరాత్రి తర్వాత ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై వైమానిక దాడులకు దిగింది అమెరికా. ఈ దాడులతో ఇరాన్‌లోని పలు నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో అత్యంత కీలకమైన ఓడరేవు బందర్ అబ్బాస్. ఆ ప్రాంతంలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి.

Advertisement

తాజా దాడుల్లో భారత్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన చాబహార్ పోర్టు కూడా ఉంది. రాత్రి దాడుల్లో ఆ పోర్టు భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. చాబహార్‌ పోర్ట్, ఇమామ్ అలీ నెజ్దా, షాహిద్ బెహెష్తీ వంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఈ దాడుల నేపథ్యంలో చాబహార్ సిటీలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

చాబహారం పోర్టుతోపాటు కీలక స్థావరాలపై దాడులు-చాబహార్‌తోపాటు బందర్ అబ్బాస్, కోనారక్, బుషెహర్, సిరిక్, క్విష్మ్ ఐలాండ్‌లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌పై తాము దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధృవీకరించింది. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకోవడం వల్ల ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపింది.

Advertisement

అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ సాగిస్తున్న దురాక్రమణకు ఆ దేశాన్ని బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. గురువారం తెల్లవారుజాము నుంచి అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై భారీ ప్రతిదాడులను ప్రారంభించినట్లు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. మంగళవారం రాత్రి అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 60 యుద్ధ బోట్లు, 80 సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

ఈ నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై క్షిపణుల దాడులు చేసింది ఇరాన్. చాబహార్ ఎందుకు ముఖ్యమైనది? అమెరికా దాడి చేసిన చాబహార పోర్టు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. హోర్ముజ్ జలసంధికి వెలుపల ఒమన్ గల్ఫ్‌లో ఉంది చాబహార్ పోర్టు. ఇరాన్‌కు లోతైన సముద్ర ఓడరేవు, హిందూ మహాసముద్రంలోకి టెహ్రాన్‌కు ఉన్న అత్యంత ముఖ్యమైన ప్రవేశ ద్వారాలలో ఇది ఒకటి.

ALSO READ: ఈ రాత్రికే ఇరాన్‌పై దాడులు చేస్తా.. ట్రంప్ సంచలన హెచ్చరిక!

ఈ ఓడరేవును ఇరాన్‌కు కీలకమైన ఆర్థిక జీవనాడిగా పరిగణిస్తారు. పాకిస్తాన్‌ను దాటవేస్తూ ఆఫ్ఘనిస్తాన్-మధ్య ఆసియాతో అనుసంధానించే వాణిజ్య కారిడార్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాలలో భాగంగా భారత్ అక్కడ భారీ పెట్టుబడులు పెట్టింది. వాటిని వెనక్కి తీసుకోవాలని కొన్నాళ్లుగా భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు లేకపోలేదు. వచ్చే ఏడాదితో చాబహార్ పోర్టు నుంచి భారత్ తప్పుకోవచ్చని వార్తల నేపథ్యంలో ఈ దాడి జరిగింది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×