E-Paper
Advertisement

OTT Movie : తండ్రిని మించిన కొడుకులు… సూపర్ పవర్స్‌తో అల్టిమేట్ యాక్షన్… ఈ హాలీవుడ్ కామెడీ తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : తండ్రిని మించిన కొడుకులు… సూపర్ పవర్స్‌తో అల్టిమేట్ యాక్షన్… ఈ హాలీవుడ్ కామెడీ తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక హాలీవుడ్ కామెడీ యాక్షన్ మూవీని ఆడియన్స్ తెగ చూస్తున్నారు. ఈ సినిమా కామెడీతో పాటు, యాక్షన్ సీన్స్ తో టాప్ లేపుతోంది. ఇందులో ఇద్దరు చిన్న పిల్లల విన్యాసాలు కూడా ఆశ్చర్య పరుస్తాయి. ఈ కథ ఇంటి దగ్గర ఉంటూ, తమ పిల్లలను చూసుకునే ఇద్దరు తండ్రుల చుట్టూ తిరుగుతుంది. ఒక రోజు కిరాయి గూండాలు వీళ్ళని వెంబడించడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమాని పిల్లలతో కలసి చూస్తే మరింత ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

‘ప్లే డేట్’ 2025లో విడుదలైన అమెరికన్ యాక్షన్ కామెడీ చిత్రం. ఇందులో లూక్ గ్రీన్‌ఫీల్డ్ డైరెక్షన్‌లో కెవిన్ జేమ్స్ (బ్రయన్) అలాన్ రిచ్‌సన్ (జెఫ్) ప్రధాన పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో 2025 నవంబర్ 12 నుండి స్ట్రీమింగ్‌లో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బ్రయాన్ అనే అకౌంటెంట్ కి జాబ్ పోయి ఇంట్లోనే కూర్చునే తండ్రి అయిపోయాడు. భార్య బయట పని చేస్తుంది. అయితే అతను తన కొడుకు డేవిడ్ ని చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతని కొడుకుతో స్కూల్‌లో కొత్త ఫ్రెండ్ వయోలెట్ తో ప్లే డేట్ ఫిక్స్ అవుంది. వయోలెట్ తండ్రి పేరు జెఫ్ చూడటానికి హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు. బ్రయాన్, డేవిడ్ ని తీసుకుని పిల్లల ప్లేజోన్‌కి వెళ్తాడు. అక్కడ జెఫ్, వయోలెట్ కలుస్తారు. మొదట్లో బ్రయాన్‌కి జెఫ్ అంత ఇష్టం కాడు. ఈయన ఎందుకంత ఫిట్‌గా ఉన్నాడు రా బాబు అని లోపల అసూయ పడతాడు. కానీ పిల్లలు ఆడుకుంటుంటే ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడే ఒక్కసారిగా పెద్ద గన్ సౌండ్ వినబడుతుంది.

Read Also : గేమ్స్ గెలవడానికి స్టూడెంట్స్ ఎత్తులు… అమ్మాయిలతో పొత్తులు… స్పానిష్ ట్రెండింగ్ సిరీస్ తెలుగులో

Advertisement

అక్కడికి మాస్కులు పెట్టుకున్న కిరాయి హంతకులు దూసుకొచ్చేస్తారు. అక్కడ ఉన్న అందరూ భయపడిపోతారు. కానీ జెఫ్ మాత్రం కూల్‌గా ముగ్గురిని కొట్టి కిందపడేస్తాడు. బ్రయాన్ షాక్ అవుతాడు. నువ్వు ఎవరు బయ్యా? అని అడుగుతాడు. జెఫ్ తాను ఇంతకు ముందు CIA సీక్రెట్ ఏజెంట్ అని, ఇప్పుడు రిటైర్ అయి ఇంట్లోనే ఉంటున్నానని షాక్ ఇస్తాడు. కానీ ఒక పెద్ద డేటా చిప్ తన దగ్గర ఉందని, దాన్ని లాక్కోవడానికే ఈ గూండాలు వచ్చారని చెప్తాడు. ఇక అక్కడి నుంచి పూర్తి యాక్షన్ మోడ్ ఆన్ అవుతుంది. చివరికి జెఫ్ కిరాయి గూండాలను ఎలా ఎదుర్కుంటాడు ? అతని దగ్గర ఉన్న డేటా చిప్ లో ఏముంది ? అనే విషయాలను, ఈ హాలీవుడ్ కామెడీ యాక్షన్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×