E-Paper
Advertisement

OTT Movie : యూరిన్ తాగి ఇదేం పాడు పని… ప్రయాణం చేస్తూ పరలోకానికి… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : యూరిన్ తాగి ఇదేం పాడు పని… ప్రయాణం చేస్తూ పరలోకానికి… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie: భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో పెద్దగా యాక్షన్ సీన్స్ ఉండవు. అలాగని పవర్ ఫుల్ డైలాగులు ఉండవు. పగలబడి నవ్వే కామెడీ, యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ సీన్స్ అంతకన్నా ఉండవు. కేవలం ఒకే ఒక్క ఎలిమెంట్ తో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుర్చీలో కదలకుండా కూర్చోబెట్టగలిగే జానర్ సినిమాలే సర్వైవల థ్రిల్లర్లు. ఏ భాషలో వచ్చినా సరే ఇలాంటి సినిమాలకు క్రేజ్ ఏమాత్రం తగ్గదు. అందుకే ఈ రోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి మూవీనే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సర్వైవల్ థ్రిల్లర్ పేరు ‘టన్నెల్’ (Tunnel). 2016లో విడుదలైన ఈ సౌత్ కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ కు డైరెక్టర్ కిమ్ సియోంగ్-హూన్ (Kim Seong-hun). హా జంగ్-వూ (Ha Jung-woo) (టన్నెల్‌లో ఇరుక్కుపోయిన ప్రధాన పాత్ర, కార్ డీలర్ లీ జంగ్-సూ), బే డూనా (Bae Doona) – జంగ్-సూ భార్య (సీ-యూన్), ఓ డాల్-సూ (Oh Dal-su) – రెస్క్యూ టీమ్ లీడర్ (డే-క్యూంగ్), ప్రధాన పాత్రధారులు. షిన్ జంగ్-గ్యూన్, పార్క్ హ్యూక్-క్వాన్ మొదలైనవారు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సర్వైవల్ డ్రామా + థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలగలిసి ఉన్న ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే IMDbలో 6.8 రేటింగ్ ఉంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : మొగుడు పెళ్ళాల దొంగాట… ఆ పని కోసం పక్కచూపులు… బాబోయ్ ఏం సీన్లు సామీ ?

కథలోకి వెళ్తే…

లీ జంగ్-సూ ఒక సాధారణ కార్ డీలర్. తన కూతురి పుట్టినరోజు నాడు ఉత్సాహంగా కేక్ తీసుకుని ఇంటికి వెళతాడు. అలా జర్నీ చేస్తున్న అతనికి ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. కొత్తగా నిర్మించిన హాడో అనే టన్నెల్‌లోకి అతని కారు ప్రవేశించగానే… ఆ టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. జంగ్-సూ కొద్దిపాటి గాయాలతో తన కారులోనే విరిగిపడ్డ శిథిలాల మధ్య ఇరుక్కుపోతాడు. ఆ టైమ్ లో అతని చేతిలో కేవలం రెండు వాటర్ బాటిళ్లు, కూతురు పుట్టినరోజు కోసం కొన్న కేక్, స్విచ్ ఆఫ్ కాబోతున్న మొబైల్ ఫోన్ మాత్రమే. ఇక విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ లీడర్ (ఓ డాల్-సూ) ఆధ్వర్యంలో జరుగుతుంది. జంగ్-సూ భార్య (బే డూనా) తన భర్త కోసం ఆందోళన పడుతుంది. జంగ్-సూ లోపల సర్వైవల్ కోసం చేస్తున్న పోరాటం, బయట రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు, మీడియా సర్కస్, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలతో సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది. 35 రోజుల పాటు టన్నెల్‌లో చిక్కుకున్న హీరో ఎలా బతికిబయట పడ్డాడో తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×