E-Paper
Advertisement

OTT Movie : హింట్స్ ఇస్తూ పోలీసుల మర్డర్స్… పోలీస్ డిపార్ట్మెంట్ కే చెమటలు పట్టించే కిల్లర్… కేక పెట్టించే మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : హింట్స్ ఇస్తూ పోలీసుల మర్డర్స్… పోలీస్ డిపార్ట్మెంట్ కే చెమటలు పట్టించే కిల్లర్… కేక పెట్టించే మలయాళ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నంత సేపూ కంటిరెప్ప వాల్చనంత ఎంగేజింగ్ గా చేస్తాయి. సాధరణంగా ఇలాంటి సినిమాలలో కిల్లర్ క్రైమ్ చేయడం, పోలీసులు అతన్ని వెతికి పట్టుకోవడానికి పరుగులు పెట్టడం అనే ప్లాట్ చూస్తూ ఉంటాము. కానీ ఈ సినిమాలో మాత్రం సైకో ఏకాంగ్ పోలీసులనే టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. ఊరవతల శవాన్ని పారేసి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అని సవాల్ విసురుతాడు. మరి ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

కుంచాకో బోబన్, శ్రీనాథ్ భాసి, షరాఫ్ యుద్దీన్, ఉన్నిమయ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంజామ్ పతిరా’ (anjaam pathiraa). మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగులో ‘మిడ్ నైట్ మర్డర్స్’ (midnight murders) పేరుతో విడుదలైంది. 2020 లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం తెలుగులో ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం… ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

Advertisement

Read Also : పెళ్లి వద్దు ప్రేమే ముద్దనే అమ్మాయి… రాత్రీపగలు అలాంటి పనులే… క్లైమాక్స్ వరకు ఆ సీన్లే

కథలోకి వెళ్తే… 

ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్‌ అన్వర్‌ హుస్సేన్‌ (కుంచకో బోబన్‌). అతను సిటీ పోలీస్‌శాఖలో అన్ అఫిషియల్ గా క్రిమినాలజిస్ట్‌గా పని చేస్తాడు. అంటే పోలీసులకు తెగని కేసుల్లో దగ్గరుండి హెల్ప్ చేస్తాడన్న మాట. పోలీసులకు కూడా అంతుచిక్కని క్లూలు దొరకబట్టి కేసు విచారణ సజావుగా సాగేలా చేస్తాడు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఓరోజు విశాఖ పోలీస్‌ డిపార్ట్మెంట్ లో డీఎస్పీగా పని చేస్తున్న అభిమన్యు కౌశిక్‌ అత్యంత దారుణంగా హత్యకు గురవుతాడు. ఆయన కళ్లు, గుండెను కోసేసి, శవాన్ని ఊరవతల పడేస్తారు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే మరో పోలీస్‌ ఆఫీసర్‌ కూడా అచ్చం ఇలాగే మర్డర్ కు గురవుతాడు. దీంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన పోలీసులు కిల్లర్ కోసం ముమ్మరంగా గాలిస్తారు.

Advertisement

అలా సాగుతున్న ఇన్వెస్టిగేషన్ లో పోలీసుల మృతదేహం పక్కన కళ్లకు గంతలు లేకుండా ఉన్న న్యాయదేవత ప్రతిమ కనిపించి, కేసును ఊహించని మలుపు తిప్పుతుంది. అంతుచిక్కని ఈ మిస్టరీని చేధించడానికి పోలీసులు డాక్టర్‌ అన్వర్‌ హుస్సేన్‌ సహాయం తీసుకుంటారు. మరి అన్వర్ ఈ కేసు వెనకాల ఉన్న కిల్లర్ ను పట్టుకోగలిగాడా? ఇంతకీ హంతకుడు ఎవరు? పోలీసులనే ఎందుకు చంపుతున్నాడు? అనేది తెలియాలంటే ఈ మూవీని ఓటీటీలో చూడాల్సిందే.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×