E-Paper
Advertisement

Telangana: మంత్రి వర్గంలో మార్పులు.. బిగ్ టీవీ చెప్పిందే జరగనుందా?

Telangana: మంత్రి వర్గంలో మార్పులు.. బిగ్ టీవీ చెప్పిందే జరగనుందా?
Advertisement

Telangana: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై బిగ్ టీవీ ముందే బ్లాస్ట్ చేసింది.. త్వరలో మంత్రుల మార్పు ఖాయం అని బల్లగుద్ది చెప్పింది.. దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది.. అయితే ఇదే విషయాన్ని మీడియా చిట్ చాట్‌లో సైతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణపై నిన్న ఢిల్లీలో క్లారిటీ ఇచ్చారు.. మంత్రి వర్గంలో త్వరలో మార్పులు ఉండే ఛాన్స్ అని చెప్పారు..దింతో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

బిగ్ టీవీ చెప్పినట్లే క్యాబినెట్లో మార్పులు చేర్పులు..

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో బిగ్ పొలిటికల్ బ్లాస్ట్ ఉంటుందని బిగ్ టీవీ చెప్పినట్టే క్యాబినెట్ లో మార్పులు ఉండబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది.. ఈ మేరకు రాష్ట్ర అధినాయకత్వం ఏఐసీసీ పెద్దలతో కసరత్తర్తు చేస్తున్నట్లు తెలు స్తోంది.. దీంతో ఇంతకీ ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది… ఎవరికి క్యాబినెట్ నుండి స్దాన చలం కలగనుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. మరో వైపు రాష్ట్ర క్యాబినెట్లో మార్పులు ఉండే ఛాన్స్ ఉంది అని పీసీసీ చీఫ్ ఢిల్లీ మీడియా చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చారు.. అంతకు ముందు బిగ్ టీవీ పలువురి పేర్లను ప్రస్తావిస్తూ బిగ్ పొలిటికల్ బ్రేకింగ్ బ్లాస్ట్ చేసింది.. దాంతో గాంధీ భవన్ వర్గాల్లో అదే విషయమై అప్పట్లో చర్చ జోరుగా సాగింది.

మహేష్‌గౌడ్ క్యాబినెట్లోకి వస్తారని ప్రచారం

Advertisement

మీడియా చిట్‌చాట్‌లో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ రాష్ట్ర క్యాబినెట్ ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కాబోతోంది అని క్లారిటీ ఇచ్చారు.. రాష్ట్ర కేబినెట్ లోకి తాను వెళ్లే ప్రసక్తే లేదని, అదంతా కేవలం ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు.. పీసీసీ అధ్యక్ష పదవి తో చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశారు..రాష్ట్ర మంత్రికి లేని ప్రాధాన్యత పీసీసీ అధ్యక్షుడికి ఉందని పేర్కొన్నారు.

తనకు పీసీసీ చీఫ్ పదవే కావాలంటున్న మహేష్ గౌడ్

పీసీసీ అధ్యక్ష పదవి కూడా మారుతుంది, త్వరలో ప్రస్తుత పీసీసీ క్యాబినెట్ లోకి వెళ్తారు అనే చర్చ ఒక వైపు కొనసాగుతుంటే …మరో వైపు పీసీసీ అధ్యక్షుడు మాత్రం తనకి పార్టీ అధ్యక్ష పదవే కావాలని ఢిల్లీ పెద్దలకు విన్నవించుకున్నారంటున్నారు. నేరుగా పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణకు ప్రయత్నం జరుగుతుంది అని చెప్పడంతో పార్టీలో చర్చ మొదలైంది..ఆ క్రమంలో ఈ మార్పుల్లో ఏం జరగబోతోంది..అధిష్ఠానం ఎవరికి షాక్ ఇచ్చి..ఎవరికి అవకాశం ఇవ్వబోతోంది అనేది కాంగ్రెస్ నేతల్లో సస్పెన్స్‌గా మారింది.

Advertisement

Story By Ajay, Big Tv 

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×