E-Paper
Advertisement

OTT Movie: మొదటి రాత్రే ఫుల్ బాటిల్ లేపే భార్య… గుటకలు మింగే భర్త… ఈ పంజాబీ సినిమాతో భలే కిక్కు మావా

OTT Movie: మొదటి రాత్రే ఫుల్ బాటిల్ లేపే భార్య… గుటకలు మింగే భర్త… ఈ పంజాబీ సినిమాతో భలే కిక్కు మావా
Advertisement

OTT Movie : పంజాబీ సినిమాల సూపర్‌ హిట్ ఫ్రాంచైజీ ‘నిక్కా జైల్దార్’ 4వ భాగం డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగు పెట్టింది. ఈ పంజాబీ సినిమా, హిందీ, తెలుగు, తమిళంలో అందుబాటులోకి వచ్చింది. బాక్సాఫీస్‌లో 50 కోట్లకు పైగా వసూలు చేసి మరో సారి సత్తా చాటింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మీ విర్క్, సోనామ్ బాజ్వా యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రేమ పెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ లో వచ్చే కొత్త ట్విస్ట్ తో ఈ స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ….

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2025 అక్టోబర్ 2 న థియేటర్లలో విడుదలై, దాదాపు రెండు నెలల తర్వాత ‘నిక్కా జైల్దార్ 4’ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ రొమాంటిక్ సినిమా నవంబర్ 27 నుంచి చౌపాల్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మీ విర్క్, సోనమ్ బజ్వా జంటగా నటించిన ఈ పంజాబీ రొమాంటిక్ కామెడీ అమ్మీ విర్క్ ఫ్రాంచైజీలో నాల్గవ భాగం. బాక్సాఫీస్‌లో రికార్డ్‌లు కొట్టిన ఈ సినిమా సిమర్జిట్ సింగ్ దర్శకత్వంలో రూపొందింది. 140 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.0/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నిక్కా అనే యువకుడు పంజాబ్ గ్రామంలో తన ట్రెడిషనల్ ఫ్యామిలీతో ఉంటాడు. అతని నాన్న మంచి సాంప్రదాయం నుచి వచ్చిన అమ్మాయిని చూసి నిక్కాకి పెళ్లి చేయాలని అనుకుంటాడు. కానీ నిక్కా కళ్లు ఆంజెల్ ప్రీత్ మీద పడతాయి. ఆమె మోడ్రన్ గా ఉండే సిటీ అమ్మాయి. నిక్కా మొదటి చూపులోనే ప్రేమలో పడి, ఆమెను గెలుచుకోవడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. ఆంజెల్ ని, ఇంట్లో వాళ్ళని పెళ్ళికి ఒప్పిస్తాడు. ఆ అమ్మాయిని గ్రాండ్ గా వివాహం చేసుకుంటాడు. ఇంతవరకూ స్టోరీ ఒకలా సాగుతుంది. ఇప్పటి నుంచి అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. నిక్కా త్వరలోనే తన భార్య మోడ్రన్ మాత్రమే కాదు, మద్యపానానికి బానిస అని తెలుసుకుంటాడు.

Read Also : షుగర్ ఫ్యాక్టరీలో చూడచక్కని దయ్యాలు… రాత్రయితే చాలు వణికిపోయే కార్మికులు

Advertisement

ఆంజెల్ మొదటి రాత్రే ఫుల్ బాటిల్ లేపేస్తుంది. నిక్కా ఇది ఒక్కసారిగా చూసి బిత్తరపోతాడు. ఆ తరువాత ఆ విషయం ఎక్కడ బయట పడుతుందేమోనని కంగారు పడతాడు. ఈ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇంతలో నిక్కా లైఫ్ లోకి మరో అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. దీంతో స్టోరీ ట్రయాంగిల్ టర్న్ తీసుకుంటుంది. చివరికి నిక్కా ఈ పరిస్థితిని ఎలా హాండిల్ చేస్తాడు ? భార్య సీక్రెట్ బయట పడుతుందా ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×