E-Paper
Advertisement

OTT Movie: ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie: ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

OTT Movie : వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’. 2025 అక్టోబర్ థియేట్రికల్ విడుదల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద100 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ సంవత్సరం టాప్ రొమాంటిక్ కామెడీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం వేచి ఉన్న ఆడియన్స్ ని పలకరిస్తోంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

థియేటర్లలోకి అడుగుపెట్టిన రెండు నెలల తర్వాత ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ సినిమా 2025 అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు నవంబర్ 27 నుంచి అందుబాటులో ఉంది. ఇందులో సన్నీ సంస్కారి (వరుణ్ ధావన్), తులసి కుమారి (జాన్వి కపూర్), అనన్య భాటియా (సన్య మల్హోత్రా), విక్రమ్ సింగ్ (రోహిత్ సరాఫ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సన్నీ సంస్కారీ (వరుణ్ ధావన్) ఢిల్లీలో ఉండే ట్రెడిషనల్ ఫ్యామిలీ యువకుడు. అతను తన గర్ల్‌ఫ్రెండ్ అనన్యా (సన్యా మల్హోత్రా)ని చాలా సీరియస్‌గా లవ్ చేస్తాడు. ఒక రోజు గ్రాండ్ గా ప్లాన్ చేసి ప్రపోజ్ చేస్తాడు. కానీ అనన్యా అతన్ని రిజెక్ట్ చేస్తుంది. సన్నీ షాక్ అయిపోతాడు. కొన్ని రోజులకి అనన్యా తన ఎక్స్ బాయ్‌ ఫ్రెండ్ విక్రమ్ (రోహిత్ సారాఫ్)తో మళ్లీ ప్యాచ్ అప్ అయి పెళ్లి ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది. దీంతో సన్నీకి గుండె పగిలిపోతుంది. ఇదే సమయంలో తులసీ కుమారి (జాన్హ్వీ కపూర్) అనే అమ్మాయి కూడా అదే సమస్యలో ఉంటుంది. ఆమె ఎక్స్ బాయ్‌ ఫ్రెండ్ కూడా విక్రమ్ డేట్ చేసి ఇప్పుడు అనన్యాతో సెటిల్ అవుతున్నాడు. ఒక పార్టీలో సన్నీ-తులసీ అనుకొండా కలుస్తారు. ఇద్దరూ తమ బాధలు షేర్ చేసుకుంటారు. అక్కడే వీళ్ళ బుర్రలో ఒక మాస్టర్ ప్లాన్ పుడుతుంది. ఇద్దరం కలిసి ఫేక్ కపుల్‌గా విక్రమ్-అనన్యా వెడ్డింగ్‌కి వెళ్లి, వాళ్లిద్దర్నీ జెలస్ అయ్యేలా చేసి, మళ్లీ వేరు చేద్దాం అని డీల్ ఫిక్స్ చేసుకుంటారు.

Read Also : అందమైన పెళ్ళాం… పక్కకి తిరిగి పడుకొనే మొగుడు… అసలు మ్యాటర్ అతడితోనే

వెడ్డింగ్ ప్రిపరేషన్స్ మొదలవుతాయి. సన్నీ-తులసీ ఫేక్ లవర్స్‌లా యాక్టింగ్ చేస్తూ వెడ్డింగ్ ఫంక్షన్స్‌కి హాజరవుతారు. డాన్స్ ప్రాక్టీస్‌లో ఇద్దరూ ఒకరినొకరు ఎత్తుకోవడం, క్లోజ్ అవ్వడం, రొమాంటిక్ పోజులతో రెచ్చిపోతారు. అన్నీ చూసి విక్రమ్-అనన్యాకి జెలసీ రావాలి కానీ… రివర్స్ అవుతుంది. సన్నీ-తులసీకి ఒకరిపై ఒకరు నిజంగానే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఫేక్ లవ్ నుంచి రియల్ లవ్‌కి షిఫ్ట్ అవుతుంది.
క్లైమాక్స్ రోజు వెడ్డింగ్ మండపంలో గందరగోళం మొదలవుతుంది. చివరికి ఈ రెండు జంటల కథలకి ఎలాంటి ముగింపు వస్తుందో తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×