E-Paper
Advertisement

OTT Movie : ఐఎండీబీలో 8.8 రేటింగ్… రిలీజై నెల తిరక్కుండానే ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : ఐఎండీబీలో 8.8 రేటింగ్… రిలీజై నెల తిరక్కుండానే ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : థియేటర్లో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి ఒక తెలుగు సినిమా దూసుకొచ్చింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ‘కర్మణ్యే వధికరస్తే’ (Karmanye Vadhikaraste) ఇప్పుడు ఐఎండీబీలో ఏకంగా 8.8/10 రేటింగ్ పొందింది. భగవద్గీతలోని “కర్మణ్యే వధికరస్తే మాంస్తేభో మా ఫలేషు కదాచన” అనే మహా వాక్యం నుంచి పేరు తీసుకున్న ఈ సినిమా, రియల్ లైఫ్ స్టూడెంట్ కిడ్నాపింగ్స్, మర్డర్స్ నేపథ్యంలో ఒక టెన్స్‌ఫుల్ ఇన్వెస్టిగేషన్ కథ. ఈ సినిమా థియేటర్లలో రిలీజైనా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఓటీటీలో అంచనాలకు మించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

అమర్‌దీప్ చల్లపల్లి దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ‘కర్మణ్యే వాధికారస్తే’. ఇది 2025 అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాగా, శుక్రవారం (నవంబర్ 21) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఐరా దయానంద్, బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్, పృథ్వీరాజ్, శివాజీ రాజా వంటి నటులు నటించారు. జ్ఞాని మ్యూజిక్ అందించగా, ఉషస్విని ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించింది. ఈ సినిమా

స్టోరీ ఏమిటంటే

Advertisement

హైదరాబాద్‌లో పృథ్వి అనే వ్యక్తి ఒక రోడ్డు అక్సిడెంట్‌లో చనిపోయినట్టు కనిపిస్తుంది. ఎసిపి అర్జున్ (శత్రు) ఈ కేసు తీసుకుని వచారించడం మొదలు పెడతాడు. ఆ అక్సిడెంట్‌లో కొన్ని వింత క్లూస్ దొరుకుతాయి. ఆ వ్యక్తి ఒక ఫేక్ అడ్రెస్ ని కలిగి ఉంటాడు. అర్జున్ విచారించే కొద్దీ ఇలాంటి ఫేక్ అడ్రెస్ లో ఉన్న వాళ్ళు మరి కొంతమంది చనిపోయినట్లు తెలుస్తుంది. మరో వైపు సిటీలో అమ్మాయిల వరుస హత్యలు జరుగుతుంటాయి. వాళ్ళను చంపే ముందు వాళ్ళు దారుణంగా అఘాయిత్యాలకు గురవుతుంటారు. దీనిని కూడా ఒక పోలిస్ టీం విచారిస్తుంటుంది.

Read Also  : సీరియల్ కిల్లర్‌గా స్టార్ హీరోయిన్… జైల్లో ఉంటూనే వరుస హత్యలు… టీజర్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్

Advertisement

ఇదే సమయంలో ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని ఎవరో కిడ్నాప్ చేసి, దారుణంగా అఘాయిత్యం చేసి ఉంటారు. ఆమె తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడి ఉంటుంది. కిరీటి అనే ఒక సస్పెండెడ్ పోలీస్ కానిస్టేబుల్ ఆమెకు వైద్యం చేయించి, ఈ కేసును విచారించడం మొదలు పెడతాడు. ఈ కేసులకు మొదట్లో ఒక దానికోకటికి లింక్ లేనట్టు కనిపించినా, విచారించే కొద్దీ ఒక భయంకరమైన నెట్ వర్క్ కి కనెక్ట్ అవుతాయి. ఈ కాన్‌స్పిరసీ ఎంత పెద్దదో తెలిసినప్పుడు వాళ్ల ముగ్గురి ప్రాణాలూ అరచేతిలో పెట్టుకున్నట్టు అవుతాయి. ఎవరూ నమ్మలేని పరిస్థితిలో ఈ క్రైమ్స్ జరుగుతుంటాయి. చివరికి పోలీసులు ఈ భయంకరమైన నెట్ వర్క్ ని ఆపగలరా? కిల్లర్స్ ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నారు ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×