E-Paper
Advertisement

The Great Pre Wedding Show OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

The Great Pre Wedding Show OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!
Advertisement

The Great Pre Wedding Show OTT: ‘మసూద’, ‘పలాస’ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు తీరువీర్. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన తనదైన నటనతో ఆకట్టున్నాడు. ముఖ్యంగా అతడు చేసిన నెగిటివ్‌ రోల్స్‌ మంచి గుర్తింపు వచ్చింది. టక్‌ జగదీస్‌ లో తిరువీర్‌ విలన్‌ గా నటించి మెప్పించాడు. అదే గుర్తింపు లీడ్‌ రోల్స్‌ లోనూ ఆఫర్స్‌ అందుకున్నాడు. అతడు హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’. నవంబర్‌ 7న థియేటర్ల విడుదలైన ఈ చిత్రం డిసెంట్‌ హిట్‌ టాక్‌ అందుకుంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

థియేటర్లలో దుమ్మురేపిన మూవీ

ఒపెనింగ్స్‌ అంత అంత మాత్రమే ఇచ్చిన మౌత్‌ టాక్‌తో కలెక్షన్స్‌ పెంచుకుంటూ హిట్‌ వైపు దూసుకుపోయింది. తిరువీరు కమెడీతోనే హీరోయిజం చూపించాడు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ ఆకట్టుకుంది. మొదటి రోజు 0.38 లక్షల కలెక్షన్లను సాధించింది. 2వ రోజు 18 శాతం పెరిగి 0.45 లక్షలకు చేరుకుంది. వీకెండ్ రూ. 50 లక్షల కలెక్షన్లతో దుమ్మురేపింది. 3 రోజుల్లో 1.33 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి, కలెక్షన్లపరంగా అదరగొట్టింది. లిమిటెడ్ స్క్రీన్ లలో రిలీజ్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 2 కోట్ల పైనే కలెక్షన్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం జీ5 (ZEE5) ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో హక్కులను సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం సినిమా థియేట్రికల్‌ రన్‌ పూర్తి అవ్వడంతో డిజిటల్‌ ప్రీమియర్‌కు ఇచ్చేందుకు సదరు సంస్థ సిద్దమైంది. ఈ మేరకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. డిసెంబర్‌ 5నుంచి జీ5 ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇక థియేటర్లలలో మిస్‌ అయిన వారంత ఇంట్లోనే ఈ అవుట్‌ అండ్‌ అవుట్‌ లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చూసి ఎంజాయ్‌ చేసేయండి.

ఫుల్ మీల్ కామెడీ ..

ది గ్రేట్‌ ప్రీవెడ్డింగ్‌ షో అనేది ఓ విలేజ్‌ ఫోటోగ్రాఫర్‌ కథ చూట్టూ తిరుగుతంది. తిరువీర్‌ ఇందులో రమేష్‌ అనే ఫోటోగ్రాఫర్‌ గా నటించాడు. అయితే అదే గ్రామానికి చెందిన పొలిటికల్‌ లీడర్‌ పెళ్లికి వీడియోలు, ఫోటోలు తీసేందుకు నియమించుకుంటాడు. అతడి పెళ్లి అంటే ఊరంత మాట్లాడుకోవాలని కలలు కంటాడు. అలా అంగరంగ వైభవంగా తన పెళ్లి ప్లాన్‌ చేసుకుంటున్న అతడు ఇప్పటి ట్రెండ్‌ కి తగ్గట్టుగా ప్రీ వెడ్డింగ్‌ కూడా చేసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం ఆ ఊరులోని ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ని కోసం వెతుకుతుండగా.. తిరువీర్‌ నియమించుకుని ప్రీ వెడ్డింగ్‌ షో నిర్వహించకుంటాడు. అతడి అసిస్టెంట్‌ ఈ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కి సంబంధి మెమొరి కార్డు పొగొట్టడంతో అత‌ను ప‌డే ఇబ్బందులు ఏంటి? తద్వారా ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడ‌నే విష‌యాల‌ను కామెడీ కోణంలో ఈ సినిమాలో చూపించారు. ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తేలా దర్శకుడు ఆ ఫుల్‌ మీల్‌ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కించాడు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×