E-Paper
Advertisement

CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా ? అయితే ఈ టిప్స్ మీకోసమే !

CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా ? అయితే ఈ టిప్స్ మీకోసమే !
Advertisement

CIBIL Score: సిబిల్ స్కోర్ అనేది మన ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే అత్యంత ముఖ్యమైన అంశం. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డులు పొందడానికి ఇది తప్పనిసరి. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే.. మీకు తక్కువ వడ్డీ రేట్లకు లోన్ లభించే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే సిబిల్ స్కోర్‌ తక్కువగా ఉన్నప్పుడు దానిని వెంటనే పెంచడం అనేది నిజంగా సాధ్యం కానప్పటికీ.. మీరు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీ స్కోర్‌ను కొన్ని వారాలు లేదా నెలల్లో మెరుగు పరచుకోవచ్చు.

Advertisement

1. బకాయిలు వెంటనే చెల్లించండి:

మీ సిబిల్ స్కోర్‌ను వేగంగా మెరుగు పరచడానికి పెడింగ్ బిల్లులు చెల్లించడం మంచిది.

Advertisement

EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు: మీ చెల్లింపు తేదీని దాటిన ఏవైనా ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు ఉంటే.. వాటిని వెంటనే పూర్తిగా చెల్లించండి. ఈ చెల్లింపు వివరాలు క్రెడిట్ బ్యూరోలకు అప్‌డేట్ అయిన వెంటనే మీ స్కోర్‌లో సానుకూల మార్పు కనిపిస్తుంది.

1. పాత బిల్లులు : గతంలో సెటిల్‌మెంట్ అయిన ఖాతాలను పూర్తి బకాయిలు చెల్లించి.. ‘క్లోజ్డ్’ లేదా ‘విత్ అవుట్ స్టాండింగ్స్’గా అప్‌డేట్ చేయమని క్రెడిటర్ (బ్యాంకు)ను అడగండి.

2. క్రెడిట్ నిష్పత్తిని తగ్గించండి:

సిబిల్ స్కోర్‌పై అత్యధిక ప్రభావం చూపే అంశాలలో ఇది ఒకటి. క్రెడిట్ వినియోగ నిష్పత్తి అంటే.. మీకు కేటాయించిన మొత్తం క్రెడిట్ పరిమితిలో మీరు ఎంతవరకు వాడుకున్నారు అని అర్ధం.

నిష్పత్తిని 30% కంటే తక్కువగా ఉంచండి: ఉదాహరణకు.. మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 1,00,000 అయితే.. మీరు రూ. 30,000 కంటే తక్కువ మాత్రమే ఉపయోగించాలి.

వేగంగా చెల్లింపులు: మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు తేదీకి ముందే కొంత మొత్తాన్ని చెల్లించడం లేదా ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఈ నిష్పత్తిని వెంటనే తగ్గించుకోవచ్చు.

3. పాత లోన్లు:

లోపాలను చెక్ చేయండి: మీ పేరు, చిరునామా, అకౌంట్ (ఉదాహరణకు, మీరు లోన్ చెల్లించినా అది ఇంకా ‘యాక్టివ్’గా చూపించడం), లేదా మొత్తం వంటి వాటిలో ఏవైనా తప్పులు ఉంటే.. వాటిని గుర్తించండి.

తక్షణ ఫిర్యాదు: ఈ లోపాలను సరిచేయడానికి వెంటనే సిబిల్ (CIBIL) పోర్టల్ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు ద్వారా ఫిర్యాదు చేయండి. సమస్య పరిష్కారం తర్వాత మీ స్కోర్ పెరుగుతుంది.

4. కొత్త లోన్లు/క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయకూడదు:

మీరు తక్కువ సమయంలో చాలా ఎక్కువ రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేస్తే.. అది మీ స్కోర్‌ను తగ్గిస్తుంది. మీరు లోన్ కోసం అప్లై చేసినప్పుడు.. బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేస్తాయి (దీనిని ‘Hard Inquiry’ అంటారు). ఇది తాత్కాలికంగా మీ స్కోర్‌ను తగ్గిస్తుంది.

స్కోర్ పెరిగే వరకు ఆగండి: మీ స్కోర్‌ను మెరుగు పరచుకునే వరకు కొత్త క్రెడిట్ కోసం అప్లై చేయకుండా కొంతకాలం వేచి ఉండండి.

5. సెక్యూర్డ్ కార్డును ఉపయోగించండి :

మీరు గతంలో క్రెడిట్ లేనివారులేదా స్కోర్ బాగా తక్కువగా ఉన్నవారు అయితే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)పై సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా క్రెడిట్ హిస్టరీని వేగంగా పెంచుకోవచ్చు.

సిబిల్ స్కోర్ మెరుగుదల అనేది ఒక నిరంతర ప్రక్రియ. పైన తెలిపిన చర్యలు తక్కువ వ్యవధిలో మెరుగుదల కోసం సహాయపడతాయి కానీ మంచి స్కోర్‌ను స్థిరంగా కొనసాగించడానికి మీరు సకాలంలో బిల్లులు చెల్లించడం, క్రెడిట్ కార్డ్ తక్కువగా వాడటం, పాత క్రెడిట్ ఖాతాలను సక్రమంగా వాడటం చాలా అవసరం

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×