E-Paper
Advertisement

Malaika Arora: పెళ్లికి ముందే డేట్ చెయ్యండి… బోల్డ్ కామెంట్స్ చేసిన నటి!

Malaika Arora: పెళ్లికి ముందే డేట్ చెయ్యండి… బోల్డ్ కామెంట్స్ చేసిన నటి!
Advertisement

Malaika Arora: ఇటీవల కాలంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు పెళ్లికి ముందే డేటింగ్ చేయడం ఆ తర్వాత ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ డేటింగ్ (Dating) కల్చర్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది. అయితే తాజాగా డేటింగ్ గురించి ప్రముఖ నటి మలైకా అరోరా(Malaika Arora) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న మలైకా ఏం మాట్లాడినా వార్తల్లో వివాదాలలో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె లవ్ రిలేషన్ గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నా.

డేటింగ్ చేసినప్పుడే స్వభావం బయటపడుతుంది..

ఈ సందర్భంగా మలైగా మాట్లాడుతూ పెళ్లి చేసుకోవడానికి ముందే కాబోయే జీవిత భాగస్వామితో డేటింగ్ చేయడం ఎంతో అవసరమని తెలిపారు. ఇలా కాబోయే వ్యక్తితో డేటింగ్ చేసినప్పుడే అతని అసలు స్వభావం బయట పడుతుందని, ఆయన ఎంతవరకు బాధ్యతాయుతంగా ఉన్నారనే విషయాలు కూడా అర్థం అవతాయని తెలిపారు. ఇలా పెళ్లికి ముందే డేటింగ్ అనేది భవిష్యత్తుకు ఎంతో కీలకమని  మలైకా తెలిపారు. ఇక ఇటీవల కాలంలో చాలామంది పెళ్లి తర్వాత అబ్బాయి గే అంటూ విడిపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే పెళ్లికి ముందే డేటింగ్ ముఖ్యమని తెలిపారు.

మలైకా డేటింగ్ వ్యాఖ్యలపై విమర్శలు..

Advertisement

ఇలా డేటింగ్ గురించి మలైకా అరోరా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనగా మారడమే కాకుండా ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలా పెళ్లికి ముందే డేటింగ్ చేసి నచ్చకపోతే విడిపోవడం మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉండటాన్ని పెళ్లి అని అనరు అంటూ ఈమె వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరికొంతమంది కూడా ఈమె చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి డేటింగ్ గురించి బోల్డ్ కామెంట్స్ చేస్తూ మలైకా హాట్ టాపిక్ గా మారారు.

వయసులో చిన్న వాడితో డేటింగ్..

Advertisement

మలైకా జీవితంలో కూడా ఈ విధమైనటువంటి ఒడిదుడుకులు ఉన్న సంగతి తెలిసిందే. ఈమె మొదట ఆర్భాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే కొన్ని వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉండడమే కాకుండా ఇద్దరు బహిరంగంగా చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ వార్తల్లో నిలిచారు. కొంతకాలానికి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అర్జున్ తో బ్రేకప్ తర్వాత మలైకా సోలో జీవితాన్ని గడుపుతున్నారు.  ఇలా స్వేచ్ఛగా జీవించడం గురించి ఎలాంటి మొహమాటం లేకుండా నిర్భయంగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ మలైగా వార్తల్లో నిలుస్తుంటారు.

Also Read: Akhanda 2: అఖండ2 రూ.250 కోట్లు పక్కా.. జోస్యం చెప్పిన తమన్.. తేడా కొట్టిందో అంతే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×