E-Paper
Advertisement

His House OTT : అబ్బాయి ఇంట్లో తిష్ట వేసే మంత్రగత్తే.. ఇది వణికించే హర్రర్ మూవీ

His House OTT : అబ్బాయి ఇంట్లో తిష్ట వేసే మంత్రగత్తే.. ఇది వణికించే హర్రర్ మూవీ
Advertisement

His House OTT : దెయ్యాల సినిమాలు చూడాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే చాలామంది పక్కన ఎవరినైనా ఉంచుకునే చూస్తుంటారు. ఎంతో కొంత భయం తగ్గుతుందనే ఒక చిరు ప్రయత్నంతో అలా చేస్తారు. అయితే కొన్ని సినిమాలు ఎంత మంది పక్కన ఉన్నా వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. అలాంటి కథనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథలో ఒక సౌత్ సూడాన్ రిఫ్యూజీ జంట ఇంగ్లండ్‌లో కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంటే, వాళ్ల కొత్త ఇంట్లో దాగి ఉన్న చీకటి శక్తి వాళ్లను వేధిస్తుంది. ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్‌తో పాటు, సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2020లో వచ్చిన ఈ బ్రిటిష్ హారర్ సినిమా పేరు ‘హిస్ హౌస్’ (His House). ఇది రెమి వీక్స్ దర్శకత్వంలో రూపొందింది. ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఐయండిబిలో 6.5/10 పొందింది. సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి బెస్ట్ ఆడియన్స్ అవార్డ్ గెలిచింది. బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్ (రెమి వీక్స్), బెస్ట్ ఆక్టర్ (సోపే డిరిసు), బెస్ట్ స్క్రీన్‌ప్లే నామినేషన్స్ వచ్చాయి. బాఫ్టా అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నామినేషన్ ఉంది. అంతేకాకుండా హారర్ జానర్‌లో సోషల్ కామెంటరీతో కలిపిన రిఫ్యూజీ థీమ్ వల్ల బెస్ట్ ఆఫ్ ది ఇయర్ లిస్టుల్లో చోటు చేసుకుంది.

Advertisement

Read Also :  కోర్టు నుండి మిరాయ్ వరకు… ఈ ఏడాది మస్ట్ వాచ్ తెలుగు సినిమాలు

స్టోరీ ఏమిటంటే

బోల్, రియాల్ అనే దంపతులు సౌత్ సూడాన్ యుద్ధం నుంచి పారిపోయి ఇంగ్లండ్‌కు చేరుకుంటారు. బోటు ప్రయాణంలో వాళ్ల చిన్న కూతురు న్యాకాన్ మునిగిపోతుంది. ఆ బాధతో కొత్త దేశంలో అసైలం కోసం ఎదురు చూస్తారు. ప్రభుత్వం వాళ్లకు ఒక పాత ఇంటిని అలాట్ చేస్తుంది. మొదట్లో కొత్త జీవితానికి అలవాటు పడుతూ, లోకల్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. బోల్ బ్రిటిష్ కల్చర్‌కు త్వరగా అలవాటు పడాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంట్లో విచిత్రమైన సౌండ్స్, గోడల్లోంచి రావడం, భయంకరమైన హాలుసినేషన్స్ మొదలవుతాయి. గోడలలో నుంచి ఒక ఆత్మ బయటికి వచ్చి, వాళ్లను రాత్రుల్లో వేధిస్తుంది. న్యాకాన్ మరణానికి వాళ్లు కారణమని, బోట్‌లో ఆమెను రక్షించకుండా కావాలనే వదిలేశారని బయటపడుతుంది. ఫైనల్‌గా ఆమె వాళ్ళ అసలు కూతురు కాదని తెలుస్తుంది. చివరికి న్యాకాన్ ఎవరు ? ఆమె ఎలా చనిపోయింది ? ఎందుకు బోల్, రియాల్ దంపతులను వెంటాడుతుంది ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×