// // Prabhas-Sujeeth: మరోసారి ‘సాహో’ కాంబో రిపీట్‌.. -->
E-Paper
Advertisement

Prabhas-Sujeeth: మరోసారి ‘సాహో’ కాంబో రిపీట్‌.. హొంబలే ఫిల్మ్స్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా

Prabhas-Sujeeth: మరోసారి ‘సాహో’ కాంబో రిపీట్‌.. హొంబలే ఫిల్మ్స్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా
Advertisement

Prabhas Reunite With Sujeeth: ప్రస్తుతం ప్రభాస్‌ సినిమాల లైనప్‌ చూస్తే దిమ్మతిరిగిపోతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ పాన్‌ ఇండియా సినిమాలకు కమిట్‌ అవుతూ చేతిలో అరడజన్‌ పైగా చిత్రాలు పెట్టుకున్నారు. అందరు అగ్ర దర్శకులే.. అగ్ర నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తూ ఇండియాలోనే నెం 1 హీరోగా మారాడు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేస్తున్నవి భారీ బడ్జెట్‌ సినిమాలు. ఒక మూవీ షూటింగ్‌ అయిపోయాగానే మరో కొత్త సినిమాను కమిట్‌ అవుతున్నారు. ప్రస్తుతం అతడి చేతిలో ది రాజా సాబ్‌, ఫౌజీ, సలార్‌ 2, కల్కి 2898 ఏడీ 2, స్పిరిట్‌ చిత్రాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నాయి.

Advertisement

అందులో దర్శకుడు సుజీత్‌తో ఓ ప్రాజెక్ట్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోపై చర్చలు జరుగుతున్నాయట. కాగా గతంలో ప్రభాస్‌ సుజీత్‌తో సాహో మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే సుజీత్‌ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. ప్రభాస్‌తో చేసిన ఈ స్పై యాక్షన్‌ మూవీ ఇటూ బాలీవుడ్‌, దక్షిణాది ఇండస్ట్రీలను షేక్ చేసింది. ఇందులో సుజీత్‌ విజన్‌కి ప్రేక్షకులు, ఇండస్ట్రీలు వర్గాలు సైతం ఫిదా అయ్యాయి. అయితే తెలుగు, దక్షిణాది భాషల్లో సాహో ఆశించిన రెస్పాన్స్‌ రాలేదు.. కానీ, బాలీవుడ్‌ బాక్సాఫీసు మాత్రం ఈ మూవీ షేక్‌ చేసింది. అక్కడ ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌.

హోంబలే ఫిల్మ్స్ భారీ స్కేచ్

ఈ సినిమా తర్వాత సుజీత్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. రెండు మూడు సినిమాలు చేసిన అవి హిట్‌ కాలేదు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత పవన్‌ ఓజీతో అతడు మళ్లీ గట్టి కంబ్యాక్‌ ఇచ్చాడు. దీంతో అగ్ర నిర్మాతలు సుజీత్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ నేపథ్యంలో కన్నడ దిగ్గజ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సుజీత్‌ను తమ బ్యానర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ కోసం లాక్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిలా సుజీత్‌తో ప్లాన్‌ చేస్తున్నారట. దీని కోసం ఆయనతో కథ రెడీ చేయిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌కి హీరోగా ప్రభాస్‌ని అనుకుంటున్నారట. ఇప్పుడు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అనగానే మొదట గుర్తోచ్చే హీరో ప్రభాస్‌. ఈ హీరో ప్రస్తుతం తను కమిటైన ఒక్కొ సినిమాను షూటింగ్స్‌ పూర్తి చేస్తూ వస్తున్నాడు.

Advertisement

Also Read: Siva Karthikeyan: రెమ్యునరేషన్‌ కోసం కోర్టు మెట్లెక్కిన హీరో శివకార్తియన్‌.. ఆ నిర్మాతపై ఫిర్యాదు

ఫౌజీ, స్పిరిట్ తో బిజీ

ది రాజా సాబ్‌ పూర్తవగా.. ఫౌజీ తుది దశలో ఉంది. దీంతో ప్రభాస్‌ కాస్తా ఫ్రీ అయ్యాడు. ఇక సుజీత్‌ కథ రెడీ చేసి.. ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి చేసేలోపు స్పిరిట్‌ మూవీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. సుజీత్‌ దర్శకుడిగా.. ప్రభాస్‌ హీరోగా హొంబలే ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థలో ఓ భారీ ప్రాజెక్ట్‌ సిద్ధమవుతుందనే టాక్‌ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గట్టిగా వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే సలార్‌ హిట్‌ తర్వాత హొంబలే ఫిల్మ్స్‌ సంస్థ ప్రభాస్‌ భారీ డిల్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. తమ సంస్థ ప్రభాస్‌ మరో మూడు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు సుజీత్‌తో ప్రభాస్‌ సినిమాను రెడీ చేసేందుకు ఆ సంస్థ ప్లాన్‌ చేస్తున్నట్టు కన్నడ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్‌.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×