E-Paper
Advertisement

Rowdy Janardhana : మాస్ అవతారంలో విజయ్ దేవరకొండ..చూస్తుంటే పూనకాలే..!

Rowdy Janardhana : మాస్ అవతారంలో విజయ్ దేవరకొండ..చూస్తుంటే పూనకాలే..!
Advertisement

Rowdy Janardhana: విజయ్ దేవరకొండ అంటేనే ఒక ఎనర్జీ.. ఒక వైబ్. అలాంటి రౌడీ స్టార్‌ను మునుపెన్నడూ చూడని విధంగా, ఒక ఊర మాస్ అవతారంలో చూపించేందుకు సిద్ధమయ్యారు ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ దర్శకుడు రవికిరణ్ కోలా. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రానికి ‘రౌడీ జనార్దన’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. గ్లింప్స్‌ను చూస్తుంటే విజయ్ దేవరకొండ ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్టు స్పష్టం అవుతోంది.

ద్వేషించిన వారే.. 
ఈ సినిమా గురించి దర్శకుడు రవికిరణ్ కోలా షేర్ చేసిన ‘డైరెక్టర్ నోట్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నేను చిన్నప్పటి నుంచి చూసిన, గమనించిన ఒక వ్యక్తి జీవితం ఆధారంగా ఈ కథను రాసుకున్నాను. ఆయన్ను ఎంత మంది ద్వేషించారో.. అంతకంటే ఎక్కువ మంది ప్రాణంగా అభిమానించారంటూ రవికిరణ్ చెప్పిన మాటలు సినిమా వెనుక ఉన్న ఎమోషనల్ డెప్త్‌ను తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తిలోని విలనిజాన్ని, అదే సమయంలో అతనిలోని మానవత్వాన్ని విజయ్ తనదైన మార్క్ యాక్టింగ్‌తో ఎలా పండించబోతున్నారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Advertisement

విజయ్ – కీర్తి సురేశ్..క్రేజీ కాంబో
మరో విశేషమేమిటంటే.. ఈ చిత్రంలో విజయ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్, మహానటి కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రౌడీ స్టార్ మాస్ మేనరిజమ్స్‌కు, కీర్తి సురేశ్ క్లాసీ పెర్ఫార్మెన్స్ తోడైతే వెండితెరపై మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయం.

కసితో వస్తున్న రౌడీ స్టార్..
‘ఫ్యామిలీ స్టార్’, ‘ది కింగ్డమ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో, ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని విజయ్ పట్టుదలతో ఉన్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన రవికిరణ్ కోలా, విజయ్‌ను సరికొత్త ‘మాస్ గాడ్’లా ప్రెజెంట్ చేయబోతున్నారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ‘రౌడీ జనార్దన’ టైటిల్‌, గ్లింప్స్‌ వైబ్రేషన్స్ చూస్తుంటే, ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో ‘అర్జున్ రెడ్డి’ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×