E-Paper
Advertisement

యాదగిరిగుట్ట నూతన ట్రస్ట్ బోర్డు.. చిరంజీవి సతీమణి సురేఖకు కీలక పదవి!

యాదగిరిగుట్ట నూతన ట్రస్ట్ బోర్డు.. చిరంజీవి సతీమణి సురేఖకు కీలక పదవి!
Advertisement

Yadagirigutta Board: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కమిటీలో ఆధ్యాత్మిక, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు చోటు కల్పించడం విశేషం. ఈ సరికొత్త బోర్డు నియామకం భక్తులలో, రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

అయితే యాదగిరిగుట్ట దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ ఫార్మా దిగ్గజం, MSN గ్రూప్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఆధ్యాత్మిక సేవల్లో ముందుండే ఆయన నేతృత్వంలో ఆలయ అభివృద్ధి మరింత వేగవంతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆయనతో పాటు పాలకమండలి సభ్యులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామితో పాటు సి.విజయరాజం, తూళ్ల విజయేందర్, పి.ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం.రాఘవేంద్ర రావు, డి.లక్ష్మి నారాయణ నాయక్ వంటి ప్రముఖులకు చోటు దక్కింది.

Advertisement

పాలకమండలిలో మెగా ఫ్యామిలీకి చోటు
అంతేకాకుండా ఈ నూతన బోర్డులో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు.. మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ. యాదద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఆమెను నియమించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే సురేఖ నియామకంపై మెగా అభిమానులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగానికి, మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలకు ఈ నియామకం ఒక నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.

భక్తుల సౌకర్యార్థం నూతన అడుగులు
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టను మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త కమిటీ పనిచేయనుంది. రాబోయే రోజుల్లో భక్తులకు కల్పించే సౌకర్యాలు, లడ్డూ ప్రసాదం నాణ్యత, ఆలయ ప్రాంగణంలో మౌలిక వసతుల విస్తరణపై ఈ నూతన బోర్డు ప్రత్యేక దృష్టి సారించనుంది. ఒకవైపు కార్పొరేట్ అనుభవం ఉన్న ఛైర్మన్, మరోవైపు ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల కలయికతో ఏర్పడిన ఈ బోర్డు.. యాదద్రి వైభవాన్ని మరింత నలుదిశలా చాటుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: ORRపై అర్ధరాత్రి కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై పోలీసుల కాల్పులు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×