E-Paper
Advertisement

Feel Good Movie OTT : 3 రూపాయల కోసం మతిపోగొట్టే పనులు… మనసుకు హత్తుకునే అచ్చ తెలుగు విలేజ్ డ్రామా

Feel Good Movie OTT : 3 రూపాయల కోసం మతిపోగొట్టే పనులు… మనసుకు హత్తుకునే అచ్చ తెలుగు విలేజ్ డ్రామా
Advertisement

Feel Good Movie OTT : ఇటీవల కాలంలో ఓటీటీలలో తెలుగు సినిమాలను భూతద్దం వేసి వెతుక్కోవాల్సి వస్తోంది. మిగతా భాషల సిరీస్ లు, సినిమాల డబ్బింగ్ వెర్షన్ లే ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. దీంతో తెలుగు సినిమాల కోసం వెతుకుతున్న ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అలాంటి వారి కోసమే అన్నట్టుగా తాజాగా ఒక అచ్చ తెలుగు ఫీల్ గుడ్ డ్రామా ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఆ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తెలుగు మూవీ పేరు ‘తొవ్వ’. అంటే దారి అని అర్థం. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాష్ ప్రధాన పాత్రను పోషించాడు. సాధారణంగా సినిమాలలో హీరోహీరోయిన్లు మెయిన్ రోల్స్ పోషిస్తూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఇందులో ఓ చిన్న పిల్లాడి చుట్టూ కథ తిరుగుతుంది. మోనిక బూసమ్, పూర్ణచంద్ర తదితరులు ఈ మూవీలో కీ రోల్స్ పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 4 నుంచే మూవీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం.

Advertisement

ఈటీవీ విన్ లో ప్రతివారం కథా సుధా వీక్లీ సిరీస్‌ లో భాగంగా ఒక కొత్త కథ తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ‘తొవ్వ’ కూడా తాజాగా ఓటీలోకి వచ్చేసింది. డైరెక్టర్ రాహుల్ పంచిక ఈ సినిమాను రూపొందించారు. డబ్బు కోసం మనుషులు ఎలాంటి అడ్డదారులు తొక్కుతారు ? దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఏంటి ? అనేది ఇందులో ప్రధానాంశం.

Read Also :  మనుషుల్లా జీవించాలని ఆశపడే రోబోలు… నవ్విస్తూనే భయపట్టే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కథలోకి వెళ్తే…

Advertisement

కథ చాలా సాదాసీదాగా ఉంటుంది. రొటీన్ లైఫ్ లో ఎదురయ్యే సంఘటనలతో ముడిపడి ఉంటుంది. 12 ఏళ్ల పిల్లాడు ఇక్కడ మెయిన్ రోల్ పోషిస్తాడు. ఆ పిల్లాడి అమ్మ, నాన్న, తాతతో కలిసి నివశిస్తుంటాడు. ఈ క్రమంలోనే వాడికి 3 రూపాయలు కావలసి వస్తుంది. అందుకే వెళ్ళి అమ్మను అడుగుతాడు. ఆమె ఇవ్వకపోవడంతో నాన్న దగ్గరకు వెళతాడు. కానీ తండ్రి కూడా మొండిచేయి చూపించడంతో, చివరకు ఆ 3 రూపాయల కోసం తాత దగ్గరకు వెళతాడు. చివరకు తాత కూడా ఇవ్వకపోవడంతో చిన్నబుచ్చుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే తానే డబ్బు సంపాదించాలని నిర్ణయం తీసుకుంటాడు.

డబ్బు ఎలా సంపాదించాలో ఆ చిన్న పిల్లాడికి తోచదు. బాగా ఆలోచించి న్యూస్ పేపర్స్ ను దొంగిలించి అమ్మాలి అనుకుంటాడు. కానీ వర్కౌట్ కాదు. దీంతో జామకాయలు అమ్మి డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. ఇలా 3 రూపాయల కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ పిల్లాడికి డబ్బుతో ఏం అవసరం ? ఎందుకు తల్లిదండ్రులు కొడుకు అడిగిన డబ్బును ఇవ్వలేదు ? చివరికి ఆ పిల్లాడు డబ్బు సంపాదించాడా ? దానితో ఏం చేయాలనుకున్నాడు ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఫీల్ గుడ్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్, డోంట్ మిస్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×