E-Paper
Advertisement

Mystery Thriller OTT : పోలీసులు మాత్రమే ఉండే కొండపై ప్రత్యక్షమయ్యే డెడ్ బాడీ… ‘ఎకో’ లాంటి మిస్టరీ థ్రిల్లర్

Mystery Thriller OTT : పోలీసులు మాత్రమే ఉండే కొండపై ప్రత్యక్షమయ్యే డెడ్ బాడీ… ‘ఎకో’ లాంటి మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Mystery Thriller OTT : మలయాళ సినిమాలకు దేశంలోని నలుమూలలా అభిమానులు ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ మనసును హత్తుకునే విధంగా, సహజంగా ఉండే మాలీవుడ్ సినిమాలు ఎంగేజింగ్ గా సాగుతాయి. అందుకే భాషతో సంబంధం లేకుండా వాళ్ళ సినిమాలను చూస్తూ ఉంటారు. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అన్నీ భాషల్లోనూ మలయాళం సినిమాలు, సిరీస్ లను రిలీజ్ చేస్తున్నారు. ఇక మలయాళ మిస్టరీ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వాళ్ల కోసమే ప్రత్యేకంగా ఈ మూవీ సజెషన్. మరి ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఏ ఓటీటీలో ఉంది ? మూవీ పేరేంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2022లో రిలీజ్ అయిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ షాహి కబీర్ డైరెక్ట్ చేసిన మూవీ ‘ఇల వీఝ పూంచిర’ (Ela Veezha Poonchira). జోసెఫ్, నయాట్టు మూవీస్ కి స్క్రిప్ట్స్ రాసిన కబీర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. సౌబిన్ షాహిర్, జూడ్ ఆంథనీ జోసెఫ్ ఇందులో మెయిన్ రోల్స్‌ పోషించారు. 1 గంట 44 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కడాస్ అన్‌టోల్డ్ బ్యానర్‌పై విష్ణు వేణు నిర్మించిన ఈ మూవీని కేరళలోని రియల్ లొకేషన్ ఇల వీఝ పూంచిర (3200 అడుగుల ఎత్తులో ఉన్న హిల్ టాప్, లైట్నింగ్ స్ట్రైక్స్ ఎక్కువగా జరిగే ప్రదేశం)లో షూట్ చేశారు.

Advertisement

Read Also : వరుస మర్డర్స్… సైకోను పట్టుకునే పక్షవాతం ఉన్న ఆఫీసర్… బోన్ చిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

కేరళ కొట్టాయం జిల్లాలోని ఇల వీఝ పూంచిర అనే అందమైన, ప్రమాదకరమైన హిల్ టాప్‌ చుట్టూ తిరుగుతుంది కథ. మధు (సౌబిన్ షాహిర్), సుధి (సుధి కొప్ప) మాత్రమే ఆ హిల్ స్టేషన్ లో ఉంటారు. నిజానికి అక్కడ సిగ్నల్, కరెంట్ రెండూ ఉండవు. కానీ ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అక్కడున్న చిన్న వైర్‌లెస్ పోలీస్ స్టేషన్‌ లో డ్యూటీ చేస్తారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే ఎవ్వరూ ఉండని ఆ కొండపై సడన్ గా ఒక మహిళ శవం కన్పిస్తుంది. ఆమె శరీర భాగాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడి ఉండడం గందరగోళంగా మారుతుంది.

Advertisement

ఇక పోలీసులు అసలు ఆ అమ్మాయి ఎవరు ? ఆమెను ఎవరు చంపారు ? అనే మిస్టరీని సాల్వ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ షురూ చేస్తారు. మరి ఇంతకీ ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు ? ఎవ్వరూ లేని ఆ కొండపై ఇలాంటి సంఘటన ఎలా చోటు చేసుకుంది ? దీనికి ఆ ఇద్దరు పోలీసులకు ఉన్న లింకు ఏంటి ? అనే ప్రశ్నలను మూవీలోనే సమాధానాలు వెతుక్కోవాలి. ఒకవేళ మీకు ‘ఎకో’ మూవీ నచ్చి ఉంటే, ఖచ్చితంగా ఈ మూవీ కూడా మెప్పిస్తుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×