E-Paper
Advertisement

Fantasy movie: 30 ఏళ్ల వయసుకు వచ్చే 13 ఏళ్ల అమ్మాయి… మేజిక్ పవర్ తో షాకింగ్ ట్విస్ట్… దిమ్మతిరిగే జీవితం

Fantasy movie: 30 ఏళ్ల వయసుకు వచ్చే 13 ఏళ్ల అమ్మాయి… మేజిక్ పవర్ తో షాకింగ్ ట్విస్ట్… దిమ్మతిరిగే జీవితం
Advertisement

Fantasy movie : కొన్ని సినిమాలు చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలను చూసినప్పుడు మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంటుంది. ఓటీటీలో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫాంటసీ రొమాంటిక్ కామెడీ సినిమా అలాంటిదే. పెద్దయ్యాక మనం సంపాదించే హోదా కంటే, మనలోని మంచి మనిషిని కోల్పోకుండా ఉండటమే ముఖ్యమని ఈ సినిమా చాలా సరదాగా చూపిస్తుంది. ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ ‘Thriller’ పాటకు వేసే డ్యాన్స్ సీన్ కూడా చాలా ఫేమస్. వీకెండ్ ఈ సినిమాపై ఓ పట్టుపట్టండి . దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో చూడవచ్చు అంటే

ఈ అమెరికన్ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ’13 గోయింగ్ ఆన్ 30′. 2004లో వచ్చిన దీనికి గ్యారీ వినిక్ దర్శకత్వం వహించారు. జెన్నిఫర్ గార్నర్, మార్క్ రుఫాలో ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం కమర్షియల్ గా కూడా విజయవంతమైంది. దీని మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ $96 మిలియన్లకు పైగా ఉంది. ఇక US బిల్‌బోర్డ్ 200 చార్ట్‌లో టాప్ 50లో ఉంది ఈ మూవీ. అంతేకాకుండా గార్నర్ నటనకు MTV మూవీ అవార్డ్స్, టీన్ ఛాయిస్ అవార్డ్స్ రెండింటి నుండి నామినేషన్లను వచ్చాయి. ప్రస్తుతం Apple TVలో ఈ సిమిమాను చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జెన్నా అనే 13 ఏళ్ల అమ్మాయికి స్కూల్లో అందరిలా పాపులర్ అవ్వాలని చాలా ఆశ. తన 13వ పుట్టినరోజు నాడు జరిగిన ఒక ఇన్సిడెంట్‌తో ఫీలయిపోయి, నాకు ఇప్పుడే 30 ఏళ్లు వచ్చేయాలి.. అప్పుడు నేను హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ఉంటాను అని కోరుకుంటుంది. కట్ చేస్తే మ్యాజిక్ వల్ల.. మరుసటి రోజు ఉదయం లేచేసరికి ఆమె నిజంగానే 30 ఏళ్ల పెద్ద అమ్మాయి అయిపోతుంది. ఇప్పుడు తను కోరుకున్నట్లే పెద్ద ఫ్యాషన్ మ్యాగజైన్‌లో జాబ్, లగ్జరీ లైఫ్ అన్నీ ఉంటాయి. కానీ లోపల మాత్రం ఆమె మనస్తత్వం ఇంకా 13 ఏళ్ల చిన్నపిల్లదే.

అయితే ఈ కొత్త ప్రపంచంలో తను వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. రాను రాను ఆమె పెద్దయ్యాక చాలా సెల్ఫీష్ గా మారుతుంది. తన చిన నాటి తన ప్రాణ స్నేహితుడు మ్యాట్‌కు కూడా దూరమైతుంది. ఇది ఆలస్యంగా తెలుసుకున్న జెన్నా నిజమైన ప్రేమను పోగొట్టుకున్నందుకు బాధపడుతుంది. ఇక వాటన్నింటినీ జెన్నా ఎలా చక్కదిద్దింది ? మ్యాట్ ప్రేమని మళ్ళీ ఎలా పొందింది ? అనేది మిగిలిన కథ.

Advertisement

Read Also : శరీరాలను మార్చే ఆత్మలు… గందరగోళంలో పడే ఫ్యామిలీ… మనసుకు హత్తుకునే క్లైమాక్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×