// // Tirupati Crime: తిరుపతిలో దారుణం.. విజయశాంతి రెడ్డి సీన్ రిపీట్, ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి సూసైడ్ -->
E-Paper
Advertisement

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. విజయశాంతి రెడ్డి సీన్ రిపీట్, ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి సూసైడ్

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. విజయశాంతి రెడ్డి సీన్ రిపీట్, ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి సూసైడ్
Advertisement

తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు సంసారాన్ని చిదిమేసాయి. కృష్ణానగర్ మూడో వీధిలో నివాసముంటున్న ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానిక సమాచారం ప్రకారం, కృష్ణానగర్‌కు చెందిన పద్మ అనే మహిళ తన కుమార్తెలు తేజ (7), లాస్య (5)లతో కలిసి ఇంట్లోనే ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పద్మ భర్త ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఇద్దరు పిల్లలతో కొన్నేళ్లపాటు సంతోషంగానే గడిపారు. అయితే, గత కొంతకాలంగా కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలైనట్లు తెలుస్తోంది.

Advertisement

ఆర్థిక ఇబ్బందులే కారణమా?

మధ్యతరగతి కుటుంబం కావడంతో.. పెరుగుతున్న ఖర్చులు, అప్పుల భారం పద్మను మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ.. వస్తున్న ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక పోవడం, దానికి తోడు ఇతర ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

Advertisement

ముక్కుపచ్చలారని ఏడేళ్ల తేజ, ఐదేళ్ల లాస్యలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన చిన్నారి తల్లులు తల్లితో పాటే అనంత లోకాలకు వెళ్లిపోవడం ఆ వీధిలో విషాద ఛాయలు నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఎంతటి కష్టం వచ్చినా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, ఆపదలో ఉన్నప్పుడు మానసిక నిపుణులను లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.

ALSO READ: CIBIL Score: నెల రోజుల్లో సిబిల్ స్కోర్ ఇలా సింపుల్ గా పెంచేయండి, లోన్ త్వరగా వచ్చేస్తుంది

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×