E-Paper
Advertisement

Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా.. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్!

Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా.. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్!
Advertisement

Telangana RTC: స్వేఛ్చ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబానికి ఆర్టీసీ అండగా నిలిచింది. అకాలంగా మృతి చెందిన ఇద్దరు డ్రైవర్స్ కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. కుషాయిగడ, ఉప్పల్ డిపోలకు చెందిన డ్రైవర్స్ వెంకటేశ్, డి.ఆర్.గౌడ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు అక్కరకొచ్చింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటంతో ఉచిత ప్రమాద బీమా పథకం వర్తించింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు.

ఆర్థిక ప్రయోజనం..

ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద యూబీఐ రూ. కోటి అందజేస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. కోటి విలువైన చెక్కులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇ.డి శ్రీ అమ్రేష్ ప్రసాద్, సిబ్బంది తో కలిసి సంస్థ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి శనివారం బస్భవన్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేరు వేరు సమయాలలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనలో కుషాయిగూడ డిపో, ఉప్పల్ డిపోకు చెందిన ఇద్దరు డ్రైవర్లు మరణించడం విచారకరమన్నారు. తమ తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో డ్రైవర్స్ అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు.

Advertisement

Also Read: Ghooskhor Pandat movie : ఓటీటీ నుంచి మనోజ్ బాజ్‌పేయి సినిమా డిలీట్… వివాదం ఏంటంటే?

ఉచిత ప్రమాద బీమా సౌకర్యం..

ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తు చేశారు. పోషణలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు. కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ పుష్ఫకుమారి, సీపీఎం ఉషాదేవి, యూబీఐ అధికారులు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. రవీంద్ర బాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. భాస్కర్, ఆర్.సత్యనారాయణ, ఇతర అధికారులు గోపాలకృష్ణ, రజనీష్ కుమార్ పాండే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Comedy Movie OTT : భార్యతో విడాకులు… వద్దు వద్దంటూనే ప్రేమలో… ఔరా అనిపించే స్టోరీ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×