E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: డ్రామాలొద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: డ్రామాలొద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: స్వేచ్చ బ్యూరో: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఈనెల 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్మికుల విజయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన గాంధేయమార్గంలో జరిపిన పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చిందని గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఐతే తాత్కాలికంగా మాత్రమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయటం కాకుండా కచ్చితంగా నెలకొకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

తీవ్ర మనో వేదన..

వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల చట్టబద్ధమైన హక్కు అని చెప్పారు. వేలాది మంది కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇన్నాళ్లు ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగా వారంతా తీవ్ర మనో వేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా తప్పనిసరిగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేయటంతో పాటు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్ చేయాలన్నారు.

Advertisement

Also read: జగన్ చేతికి కొత్త డిజిటల్ అస్త్రం.. Jagan 2.0 Super App లాంచ్.. దేనికోసమంటే?

బోనాల పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక, హైదరాబాద్ నగర ప్రజల ఐక్యతకు చిహ్నమైన ఆషాఢ బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ కవిత బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Advertisement

Also read: Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×