E-Paper
Advertisement

Dhurandhar 2: ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడు? ఎక్కడంటే?

Dhurandhar 2: ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Dhurandhar 2: సాధారణంగా ఒక సినిమా థియేటర్లలోకి వచ్చింది అంటే కచ్చితంగా ఆ సినిమా మళ్లీ బుల్లితెర ఆడియన్స్ ను మెప్పించడానికి ఓటీటీలోకి రావాల్సిందే. అయితే అన్ని సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వస్తాయా అంటే ఆయా సినిమాల ఫలితాలను బట్టి వచ్చే సమయం కూడా మారుతూ ఉంటుంది.. ఒకవేళ థియేటర్లలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అంటే.. 8 వారాలలో ఆ సినిమా ఓటీటీలోకి వస్తుంది. ఒకవేళ థియేటర్లలో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచిందంటే మాత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ పాత సినిమాల రికార్డులను కొల్లగొడుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేస్తున్న రణవీర్ సింగ్ ధురంధర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ధురంధర్..

ప్రముఖ దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో.. రణవీర్ సింగ్ హీరోగా , సారా అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ధురంధర్. గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.1350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా ధురంధర్2: ది రివేంజ్ పేరిట మార్చి 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాగా.. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ డీల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

ALSO READ:Kriti Sanon: పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. ఎదురు చూడక తప్పదా?

ధురంధర్ 2 స్ట్రీమింగ్ ఆరోజే..

ప్రస్తుతం ధురంధర్ 2 సినిమా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడు ఉంటుంది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ముందుగానే నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్స్ లో విడుదలైన సరిగ్గా 50 రోజులకు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నారట .ఇక ఈ లెక్కన చూసుకుంటే మార్చి 19న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కాబట్టి మే ఒకటి లేదా ఏడవ తేదీన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు స్ట్రీమింగ్ డేట్ పై కూడా నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఏది ఏమైనా థియేటర్లలో వరుస కలెక్షన్లను వసూలు చేస్తూ పుష్ప , బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్న ఈ సినిమా ఇటు ఓటీటీ లలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×