E-Paper
Advertisement

వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్రం నజర్.. ‘మెటా’కు నోటీసులు?

వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్రం నజర్.. ‘మెటా’కు నోటీసులు?
Advertisement

WhatsApp Username: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే, త్వరలోనే ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం ఒక ‘యూజర్‌నేమ్’ (Username) ద్వారా ఇతరులతో చాట్ చేసే వెసులుబాటును తీసుకురావడానికి మెటా సంస్థ కసరత్తు చేస్తోంది. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలోనే వాట్సాప్‌లో కూడా ఈ ఆప్షన్ రాబోతోంది. అయితే, యూజర్ల వ్యక్తిగత వివరాల రక్షణ కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్ ఇప్పుడు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనివల్ల సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

సైబర్ మోసాల ముప్పు.. అధికారుల ఆందోళన

Advertisement

సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. దీనివల్ల అవతలి వ్యక్తి ఎవరు అనేది గుర్తించడం కొంతవరకు సులభం అవుతుంది. కానీ, కేవలం యూజర్‌నేమ్స్ మాత్రమే ఉంటే, సైబర్ నేరగాళ్లకు అది ఒక వరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ (ఫేక్) ఐడీలు సృష్టించి, ప్రజలను సులభంగా మోసం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ భద్రతా విభాగాలు ఈ సరికొత్త ఫీచర్‌పై ప్రత్యేక సమీక్షను ప్రారంభించాయి.

Also Read: బెంగాల్‌లో ఉద్రిక్తత.. ఎంపీ మహువా మోయిత్రాపై కోడిగుడ్లతో దాడి!

Advertisement

జాతీయ భద్రతే ముఖ్యం.. ‘మెటా’కు నోటీసులు?

ఆన్‌లైన్ మోసాలు, వినియోగదారుల భద్రతకు ముప్పు వాటిల్లేలా ఈ ఫీచర్ ఉందన్న అనుమానాలతో కేంద్ర ఐటీ శాఖ అధికారులు దీని సాంకేతికతను లోతుగా పరిశీలిస్తున్నారు. భద్రత కోసం వాట్సాప్ ప్రతిపాదిస్తున్న ‘Username Keys’ లో ఏవైనా లోపాలు కనిపిస్తే, తదుపరి చర్యల కోసం మెటా సంస్థకు నోటీసులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశ భద్రత, పౌరుల డిజిటల్ సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఫీచర్ దుర్వినియోగం కాకుండా వాట్సాప్ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటుందనే దానిపైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×