E-Paper
Advertisement

Revenue Collection: ఊహాజనిత బడ్జెట్ వద్దు.. వాస్తవాలే ముఖ్యం.. అత్యవసర భేటీలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Revenue Collection: ఊహాజనిత బడ్జెట్ వద్దు.. వాస్తవాలే ముఖ్యం.. అత్యవసర భేటీలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
Advertisement

Revenue Collection: రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లీకేజీలను అరికట్టి ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ తెలపారు. నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక అంశాలపై సమీక్ష సమావేశం ఎర్నాటు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కె రామకృష్ణారావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆదాయం పెంపుపై..

సందర్భంగా రాష్ట్ర ఆదాయ పెంపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం తెలిపారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ఆదాయ సమీకరణలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని అధికారులకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Advertisement

Also Read: యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

పెండింగ్ ప్రాజెక్టులు..

అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని, పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా శాఖలవారిగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా భూసేకరణకు మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఊహాజనితం కాదన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని, వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయా శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎప్పడూ సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్ట్రం చేశారు.

Advertisement

Also read: GHMC: హైదరాబాద్‌కి మొదలైన చీకటి కష్టాలు.. మూడు నెలలైన దక్కని మోక్షం..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×