E-Paper
Advertisement

బెంగాల్  అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్.ఎన్. రవి!

బెంగాల్  అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్.ఎన్. రవి!
Advertisement

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం సాయంత్రం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 174, క్లాజ్ (2), సబ్-క్లాజ్ (b) ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్ భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మే 7, 2026 నుంచే ఈ రద్దు ఉత్తర్వులు అమలులోకి వస్తాయని స్పష్టం చేయడంతో బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

అయితే, ఎన్నికల్లో ఓట్ల లూటీ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయని సంగ‌తి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో గవర్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ విజయం సాధించినప్పటికీ.. సువేందు అధికారి పీఏ హత్య వంటి వరుస ఘటనలు శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పట్టాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ యంత్రాంగం సజావుగా సాగే అవకాశం లేదని భావించిన గవర్నర్.. అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోక్ భవన్ నుంచి వెలువడిన ఈ అధికారిక ప్రెస్ రిలీజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Read Also: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు తప్పిన ప్రమాదం..

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×