E-Paper
Advertisement

Pemmasani Chandrasekhar: ఇండియా పోస్టులో చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం.. 24 గంటల్లో పోస్టు డెలివరీ సేవలు: పెమ్మసాని

Pemmasani Chandrasekhar: ఇండియా పోస్టులో చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం.. 24 గంటల్లో పోస్టు డెలివరీ సేవలు: పెమ్మసాని
Advertisement

Pemmasani Chandrasekhar: కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీ వేదికగా భారత పోస్టల్ శాఖలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను వెల్లడించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాలలో భారీ సంస్కరణలు చేపట్టిందని ఆయన తెలిపారు. పోస్టల్ శాఖను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా సేవలలో వేగం పెంచడంతో పాటు గడిచిన 21 నెలలుగా ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వ్యవస్థలో మార్పులు తెచ్చినట్లు వివరించారు.

దేశీయ ఈ-కామర్స్ రంగంలో ప్రస్తుతం రూ. 90 వేల కోట్ల మేర భారీ అవకాశాలు ఉన్నాయని పెమ్మసాని పేర్కొన్నారు. అయితే ఇందులో పోస్టల్ శాఖ వాటా కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. దీనిని అధిగమించేందుకు ప్రైవేట్ కొరియర్ సంస్థలకు ధీటుగా కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. గతంలో కేవలం 2 శాతం వృద్ధి రేటు మాత్రమే ఉన్న పోస్టల్ శాఖ ఆదాయం ఒక్క ఏడాదిలోనే రూ. 200 కోట్ల నుంచి రూ. 2000 కోట్లకు పెరగడం శాఖలో వస్తున్న మార్పులకు నిదర్శనమని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ-కామర్స్ ద్వారా ఏటా రూ. 5-10 వేల కోట్ల వృద్ధిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Advertisement

వినియోగదారులకు మెరుగైన సేవలందించే క్రమంలో ఆరు ప్రధాన నగరాల్లో 24 నుండి 48 గంటల్లో గ్యారెంటీ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించారు. ఒకవేళ డెలివరీలో ఆలస్యం జరిగితే కస్టమర్లకు డబ్బులు రీఫండ్ చేసే సరికొత్త వెసులుబాటును కూడా కల్పించామని వెల్లడించారు. డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ ఎయిర్ కార్గో సంస్థలతో టైఅప్‌లు చేసుకుంటున్నామని భవిష్యత్తులో పోస్టల్ శాఖకు సొంతంగా కార్గో విమానాలను సమకూర్చుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలతో కలిసి గ్రామీణ ప్రాంతాలకు ‘లాస్ట్ మైల్ డెలివరీ’ సేవలను విస్తరించనున్నట్లు వివరించారు.

పోస్టల్ సేవల ధరలను ప్రైవేట్ కొరియర్ల కంటే తక్కువగా.. పోటీగా నిర్ణయించామని అలాగే భారీ కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పోస్టాఫీసులు, రూట్ల రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు. పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పోస్టల్ సేవలపై చాలా స్వల్పంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సామాన్యులకు మరింత చేరువయ్యేలా మారుతున్న పోస్టల్ సేవలను ప్రజలందరూ విరివిగా వినియోగించుకోవాలని పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Read Also: Nara Lokesh: 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యం.. ఏపీఈడీబీ కార్యాలయ ప్రారంభోత్సవంలో లోకేష్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×