E-Paper
Advertisement

Congress Plans: హైదరాబాద్‌లో హస్తం గేమ్ ప్లాన్ ఇదేనా? గ్రేటర్ ఎన్నికలకు 300 అభ్యర్థులపై ఫోకస్!

Congress Plans: హైదరాబాద్‌లో హస్తం గేమ్ ప్లాన్ ఇదేనా? గ్రేటర్ ఎన్నికలకు 300 అభ్యర్థులపై ఫోకస్!
Advertisement

Congress Plans: కాంగ్రెస్‌కు 300 మంది యోధులు కావ‌లెను … ఇదేదో అడ్వర్టైజ్‌మెంట్ ప్రక‌ట‌నలా ఉందనుకుంటున్నారా? .. య‌స్.. ఇది గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రక‌ట‌న … జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పోరేష‌న్ల‌లో బ‌లం పెంచుకునేందుకు సమర్ధులైన నేత‌ల‌ కోసం వెతుకుతుంది కాంగ్రెస్.. 3 మేయ‌ర్ పీఠాలు కైవసం చేసుకోవడమే ల‌క్ష్యంగా హ‌స్తం పార్టీ నేత‌ల‌ను సిద్దం చేసుకునే ప‌నిలో ప‌డింది. ఇంత‌కీ హైద‌రాబాద్‌లో హ‌స్తం ప్లాన్ గేమ్ ప్లాన్ ఏంటి?

 ప్రభుత్వం ప్లాన్

మ‌రో నాలుగు అయిదు నెల‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని హైద‌రాబాద్ , మ‌ల్కాజిగిరి , సైబరాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ల ఎన్నిక‌లు నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు స‌మాచారం … ఇంతవరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్లు ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. దాంతో డివిజన్ల సంఖ్య 300కి పెరిగింది. 2023 అసెంబ్లీలో కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో బోణీ కొట్టలేకపోయింది. అందకు ముందు జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేప‌ధ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బ‌ల‌ప‌డేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తోంది . గ‌త అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో కాంగ్రెస్ కు ఆశించిన ఫ‌లితాలు రాలేదు … దీంతో ఈ సారి మూడు కార్పోరేష‌న్ ల‌లో జెండా ఎగుర‌వేసి ప‌ట్టుసాధించాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు హ‌స్తం నేత‌లు . గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని మూడు కార్పొరేష‌న్ల‌లో నాయ‌కుల కొర‌త హ‌స్తం పార్టీ ని వేధిస్తుంది . వ‌రుస‌గా పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో లేక‌పోవ‌డంతో చాలామంది నేత‌లు పార్టీ వీడారు . అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి, గ్రేట‌ర్‌ పరిధిలో జరిగిన కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్‌లలో విజయం సాధించడంతో ఆ పార్టీకి అధికారికంగా ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.

Advertisement

Also Read: Illegal Constructions: ఆకాశమే హద్దుగా అక్రమ నిర్మాణాలు.. మైసమ్మగూడలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం

బ‌లం పెంచుకునేందుకు హ‌స్తం పార్టీ వ్యూహాలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో సత్తా చాటుకున్న బీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నారు. అలా లెక్కల పరంగా గ్రేటర్‌లో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలున్నా… ఇంకా కాంగ్రెస్ సంస్థగతంగా పుంజుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది …దీంతో బ‌లం పెంచుకునేందుకు హ‌స్తం పార్టీ వ్యూహాలు ర‌చిస్తోందంట …ఇప్ప‌టికే కొంద‌రు బీఆర్ఎష్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా … మ‌రికొంద‌రిని చేర్చుకునేందుకు సిద్ద‌మ‌వుతోందంట అధికారపక్షం ఇదంతా ఒక ఎత్తు అయితే హ‌స్తం పార్టీలోని సమర్ధులైన ద్వితీయ స్థాయి నేత‌లంద‌రినీ వ‌చ్చే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బ‌రిలో దింపాల‌ని పీసీసీ పెద్దలు డిసైడ్ అయ్యార‌ట .

పోటీకి గ్రీన్ సిగ్నల్

Advertisement

మూడు మున్సిపాలిటిల‌లోని 300 డివిజ‌న్ ల‌లో ఎవ‌రెవ‌రిని బ‌రిలో దింపాల‌నేది ఇప్పటి నుంచే క‌స‌రత్తు చేస్తున్నార‌ట కాంగ్రెస్ పెద్దలు … ప్రస్తుతం గ్రేట‌ర్ ప‌రిధిలోని చాలామంది నేత‌లు కార్పొరేష‌న్ ఛైర్మెన్ లుగా ఉన్నారు… ఒక‌టి రెండు నెల‌ల్లో వారి పద‌వి కాలం ముగియనుంది ..దాంతో వారంద‌రిని ఎన్నిక‌ల బ‌రిలో దింపేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్దమ‌యిన‌ట్లు స‌మాచారం …హైద‌రాబాద్ లో పార్టీ బ‌లం పెర‌గాలంటే ముఖ్య‌నేత‌లంతా బ‌రిలో ఉండాల్సిందేన‌ని ఇప్ప‌టికే కొంద‌రు నేత‌ల‌కు సంకేతాలు ఇచ్చార‌ట పీసీసీ అధ్యక్షుడు జూన్ నెల చివ‌రి నాటికి 300 మంది అభ్యర్దుల‌ను సిద్దం చేయాల‌ని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంద‌ట …ఇప్పటికే కొంద‌రు నేత‌ల‌కు ఆయా డివిజ‌న్ ల‌లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద‌ట టీ కాంగ్రెస్ … మొత్తం గా వ‌చ్చే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో 300 మంది యోధుల‌తో పోరాటానికి స‌మాయ‌త్తం అవుతోంది కాంగ్రెస్ ..చూడాలి మ‌రి కాంగ్రెస్ వ్యూహం ఏ మేర‌కు వర్కౌట్ అవుతుందో..

Also Read: Manchu Lakshmi: ఘనంగా మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక..ఫోటోలు వైరల్!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×