E-Paper
Advertisement

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026 ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఫుల్ లిస్ట్‌ మీకోసం

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026 ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఫుల్ లిస్ట్‌ మీకోసం
Advertisement

Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్డెట్ – 2026 ప్రవేశపెట్టారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన ప్రకటనలు, బడ్టెట్ కేటాయింపులు, పన్ను మినహాయింపులు ప్రకటించారు. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతీసారి సామాన్యుల దృష్టి రెండు అంశాలపైకి వెళ్తుంటాయి. కొత్త బడ్జెట్ కారణంగా వేటి ధరలు తగ్గబోతున్నాయ్? ఏ వస్తువులు ప్రియంగా మారనున్నాయ్? వంటి వాటిని పరిశీలిస్తుంటారు. అయితే ఎప్పటిలాగానే తాజా బడ్జెట్ లోనూ కొన్నింటిపై సుంకాల మినహాయింపులు, మరికొన్నింటిపై వడ్డింపులు జరిగాయి. దానివల్ల ఆయా వస్తువుల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ధరలు తగ్గే వస్తువులు..!

కేంద్ర బడ్జెట్ లో తీసుకున్న కొన్ని సడలింపుల కారణంగా పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. విమాన విడి భాగాలు, మైక్రోవేవ్ పార్ట్స్, మైక్రో వేవ్ ఓవెన్లు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, డయాబెటిక్ – క్యాన్సర్ సహా 17 రకాల ఔషదాలు చౌకగా లభించనున్నాయి. అదే విధంగా స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ధరలు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: Union Budget 2026: పన్ను సరిగా కట్టట్లేదా? ఇకపై మీ ఆటలు సాగవు.. ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన

వీటి ధరలు పెరుగుతాయ్..!

ఆర్థిక మంత్రి తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లగ్జరీ గడియారాలు, దిగుమతి చేసుకునే మద్యం, సిగరేట్లు, బీడీలు, పాన్ మసాలాలు, గుట్కాల ధరలు పెరగనున్నాయి. మరోవైపు కాఫీ ఉత్పత్తి కోసం ఇప్పటివరకూ ఇస్తూ వచ్చిన కొన్ని మినహాయింపులను కేంద్రం తొలగించింది. దీంతో కాఫీ ప్రొడక్ట్స్ ధరలు పెగిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటితో పాటు అమ్మోనియం ఫాస్పెట్ లేదా అమ్మోనియా నైట్రో- ఫాస్పెట్ దిగుమతిపై మినహాయింపును బడ్జెట్ లో కేంద్రం విరమించుకుంది. ఫలితంగా కొన్ని ఎరువులు ప్రియం కావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి చేసుకునే టెలివిజన్ భాగాలు, కెమెరాలు, సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు ఖరీదైనవి కానున్నాయి. అదే విధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సౌండ్ రికార్డింగ్ పరికరాల ధరలు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: Union Budget-2026: నిర్మలా సీతారామన్‌ బడ్జెట్.. దశాబ్దాల సంప్రదాయానికి చెక్, పార్ట్-బీపై ఫోకస్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×