E-Paper
Advertisement

KCR Interrogation: కేసీఆర్ నివాసంలో సిట్.. నందినగర్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్!

KCR Interrogation: కేసీఆర్ నివాసంలో సిట్.. నందినగర్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్!
Advertisement

KCR Interrogation: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) విచారణకు సంబంధించి హైదరాబాద్‌లోని ఆయన నందినగర్ నివాసం వద్ద సందడి నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందం (SIT) అధికారులు కేసీఆర్ ఇంటికి చేరుకుని అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

కేసీఆర్.. నందినగర్ నివాసంలోని రెండవ అంతస్తులో ఒక ప్రత్యేక గదిని విచారణ కోసం సిట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విచారణ ప్రక్రియను రికార్డ్ చేసేందుకు, స్టేట్‌మెంట్లను నమోదు చేసేందుకు అధికారులు తమ వెంట కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తెచ్చుకున్నారు. వీరితో పాటు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఉన్నారు.

Advertisement

కేసీఆర్‌ను విచారించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ బృందంలో విజయ్ కుమార్ (డీఐజీ), వెంకటగిరి (ఏసీపీ), శ్రీధర్ (ఏసీపీ), కేఎస్ రావు (అడిషనల్ డీసీపీ), రవీందర్ రెడ్డి (అడిషనల్ డీసీపీ) ఉన్నారు.

సిట్ అధికారులు మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణ ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి, వయస్సును పరిగణనలోకి తీసుకుని, ఆయన కోరిన విధంగా ఇంటి వద్దే విచారణకు అధికారులు అంగీకరించారు. విచారణ సమయంలో ఇంట్లో కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తామని, రాజకీయ నాయకులకు లేదా ఇతరులకు ప్రవేశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

కేసీఆర్ ముందు సిట్ ఉంచబోయే ప్రధాన ప్రశ్నలు ఇవేనా..?

Advertisement

సిట్ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రశ్నల జాబితాలో ప్రధానంగా నిధుల సేకరణ మరియు రాజకీయ నిఘా అంశాలు ఉన్నట్లు సమాచారం. ఎస్‌ఐబీ (SIB) అధికారులకు రాజకీయ నాయకులు, జడ్జీలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయాలని ఆదేశాలు ఎవరి నుండి అందాయి? మీకు ఈ విషయం తెలుసా?… ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎస్‌ఐబీలోని కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను, డేటాను ధ్వంసం చేయాలని ఎందుకు నిర్ణయించారు? ఆ ఆదేశాలు మీ కార్యాలయం నుండి వెళ్లాయా?.. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎన్నికల సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం వాడుకున్నారా?…. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారి నుండి నిధులు వసూలు చేసినట్లు అరెస్టయిన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలపై మీ సమాధానం ఏమిటి?.. రిటైర్ అయిన అధికారులను కీలక పోస్టుల్లో నియమించి వారి ద్వారా ఈ పనులు చేయించారన్న ఆరోపణలపై మీ వివరణ ఏమిటి? అనే ప్ర‌శ్న‌ల‌ను సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది.

Read Also:  తప్పు చేయని వారు విచారణకు భయపడాల్సిన అవసరం లేదు.. కేసీఆర్‌కు నోటీసులపై కొండా సురేఖ క్లారిటీ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×