E-Paper
Advertisement

Todays Chanakya Exit Polls: చాణక్య సర్వే షాకింగ్ రిపోర్ట్.. ఎవరికి ఎన్ని సీట్లంటే.. వారికి షాక్ త‌ప్ప‌దా?

Todays Chanakya Exit Polls: చాణక్య సర్వే షాకింగ్ రిపోర్ట్..  ఎవరికి ఎన్ని సీట్లంటే.. వారికి షాక్ త‌ప్ప‌దా?
Advertisement

Todays Chanakya Exit Polls: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రముఖ సర్వే సంస్థ ‘టుడేస్ చాణక్య’ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దీదీకి షాకిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) అఖండ విజయం సాధించబోతోందని ఈ సంస్థ జోస్యం చెప్పింది. బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 181 నుంచి 203 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) 89-111 స్థానాలకే పరిమితం కావచ్చని పేర్కొంది. ఓట్ల శాతం పరంగా బీజేపీకి 48 శాతం.. టీఎంసీకి 38 శాతం ఓట్లు రావొచ్చని వివరించింది. బెంగాల్‌లో మెజారిటీ మార్కు 148 కాగా.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటుతుందని నివేదిక వెల్లడించింది.

దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమికి 69 సీట్లు వస్తాయని.. అధికార ఎల్డీఎఫ్ (LDF) కూటమి 64 స్థానాలకే పరిమితం అవుతుందని టుడేస్ చాణక్య అంచనా వేసింది. బీజేపీ ఇక్కడ 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఓట్ల శాతంలో యూడీఎఫ్‌కు 40 శాతం.. ఎల్డీఎఫ్‌కు 38 శాతం వచ్చినట్లు తెలిపింది. నిన్న వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా కేరళలో యూడీఎఫ్ కే మొగ్గు చూపిన నేపథ్యంలో చాణక్య నివేదిక ఆ అంచనాలను బలపరుస్తోంది.

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోబోతోందని చాణక్య స్పష్టం చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 114 నుంచి 136 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ 52-74 సీట్లు సాధించి రాష్ట్రంలో రెండో అతిపెద్ద శక్తిగా అవతరించే అవకాశం ఉందని సంచలన అంచనా వేసింది. ఏఐడీఎంకే (AIADMK) కేవలం 34-56 స్థానాలకే పరిమితం కావచ్చని పేర్కొంది. నిన్నటి యాక్సిస్ మై ఇండియా సర్వే విజయ్ పార్టీ విజయం ఖాయమని చెప్పగా.. చాణక్య మాత్రం డీఎంకేకే జై కొట్టింది.

అస్సాం రాష్ట్రంలో మాత్రం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి ప్రభంజనం సృష్టించబోతోందని చాణక్య నివేదిక పేర్కొంది. మొత్తం 126 సీట్లలో బీజేపీ కూటమి ఏకంగా 93 నుంచి 111 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ కూటమి 14-32 సీట్లకే పరిమితం కావచ్చని తెలిపింది. ఎన్డీయేకు ఏకంగా 50 శాతం ఓట్లు వస్తాయని వివరించింది. యాక్సిస్ మై ఇండియా.. చాణక్య స్ట్రాటజీస్ వంటి ఇతర సంస్థలు కూడా అస్సాంలో ఎన్డీయేదే విజయమని అంచనా వేశాయి.

Advertisement

Read Also: బెంగాల్ లో విజయంపై దీదీ ధీమా.. ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించని యాక్సిస్ మై ఇండియా

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×