E-Paper
Advertisement

రోడ్ సైడ్ ఉండే యెల్లో స్టడ్స్‌.. పవర్ లేకుండా ఎలా మెరుస్తాయి బ్రో?

రోడ్ సైడ్ ఉండే యెల్లో స్టడ్స్‌..  పవర్ లేకుండా ఎలా మెరుస్తాయి బ్రో?
Advertisement

Road Safety Tech: రాత్రి సమయంలో హైవేపై డ్రైవ్ చేస్తూ ఉంటే, రోడ్డుపై పసుపు, తెలుపు రంగులో చిన్న చిన్న మెరుస్తున్న చుక్కల్లాంటి ఆకారాలు కనిపిస్తాయి. అవి కరెంటుతో పని చేస్తున్నట్లుగా అనిపిస్తాయి. కానీ, నిజానికి వాటిలో చాలా వాటికి ఎలాంటి పవర్ కనెక్షన్ ఉండదు. వీటిని సాధారణంగా రోడ్ స్టడ్స్ లేదంటే క్యాట్స్ ఐస్ అని పిలుస్తారు. ఇవి డ్రైవర్‌ కు రోడ్డుపై మార్గాన్ని  చూపించడంలో కీ రోల్ పోషిస్తాయి.

కరెంటు లేకుండా ఎలా మెరుస్తాయి?

ఈ రోడ్ స్టడ్స్ వెనుక ఉన్నకీలక సూత్రం రెట్రోరిఫ్లెక్టివిటీ. అంటే, లైట్ ఏ దిశ నుంచి వస్తే అదే దిశలో తిరిగి వెళ్లేలా చేయడం. ప్రతి స్టడ్ లోపల ప్రత్యేక అబ్జెక్టివ్స్ ఉంటాయి. వాహనం లైట్ వీటిపై పడినప్పుడు, అది చుట్టూ చెదరిపోకుండా మళ్లీ డ్రైవర్ వైపే తిరిగి ప్రతిబింబిస్తుంది. అందుకే చీకటిలో మెరిసినట్లు కనిపిస్తాయి. సాధారణ అద్దం కాంతిని అన్ని వైపులా ప్రతిబింబిస్తుంది. కానీ, ఈ స్టడ్స్‌ లో ఉండే నిర్మాణం మాత్రం కాంతిని అదే దిశలోకి తిరిగి పంపేలా ఉంటుంది. దీనివల్ల డ్రైవర్‌ కు రోడ్డుపై లేన్లు, అంచులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి, వర్షం, పొగమంచు పడే పరిస్థితుల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

అందుబాటులోకి సోలార్ రోడ్ స్టడ్స్

Advertisement

కొన్నిచోట్ల సౌరశక్తితో పని చేసే రోడ్ స్టడ్స్ కూడా వాడుతున్నారు. ఇవి పగటిపూట సూర్యరశ్మిని గ్రహించి, లోపల ఉన్న చిన్న బ్యాటరీలో నిల్వ చేసుకుంటాయి. రాత్రి పూట ఆ పవర్ ను ఉపయోగించి LED లైట్లు వెలిగేలా చేస్తాయి. ఇవి కేవలం ప్రతిబింబం కాకుండా ఇండిపెండెంట్ గా కాంతిని ఇస్తాయి. అందువల్ల దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తాయి. సోలార్ స్టడ్స్ ముఖ్యంగా ప్రమాదకర మలుపులు, కొండ ప్రాంతాలు, ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే చోట్ల ఉపయోగిస్తారు. అలాగే విమానాశ్రయ రన్‌ వేలు, సొరంగ మార్గాల్లో కూడా ఇవి కీలకంగా ఉంటాయి. ఎలాంటి విద్యుత్ లైన్‌పై ఆధారపడకపోవడం వల్ల మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది.

ఒక్కో రంగుకు ఒక్కో అర్థం

రోడ్ స్టడ్స్‌ లో రంగులకు కూడా ప్రత్యేక అర్థం ఉంటుంది. తెలుపు రంగు సాధారణ లేన్లను సూచిస్తుంది. ఎరుపు రంగు రోడ్డుకు చివరి అంచు దగ్గర ఉందని సూచిస్తుంది. పసుపు రంగు మాత్రం ఎదురెదురుగా వచ్చే ట్రాఫిక్‌ ను వేరు చేస్తుంది. ఈ రంగులు డ్రైవర్‌ కు కీలక సమచారాన్ని అందిస్తాయి. ఈ చిన్న స్టడ్స్ చాలా సింపుల్‌ గా కనిపించినా, వాటి వెనుక ఉన్న సైన్స్ చాలా పెద్దది, తెలివైనది. సైన్స్, ఇంజనీరింగ్ కలయికగా చెప్పుకోవచ్చు.

Advertisement

Read Also: రెడ్, బ్లూ, గ్రీన్.. ఏ కలర్ గ్రీజ్ ఎందుకు వాడుతారో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×