E-Paper
Advertisement

కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. తమిళనాడు సీఎం విజయ్‌కి Z+ భద్రత

కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. తమిళనాడు సీఎం విజయ్‌కి Z+ భద్రత
Advertisement

Vijay Z+ security cover: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే టీవీకే అధినేత విజయ్‌కి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి Z+ కేటగిరీ భద్రతను కల్పించింది. దళపతి విజయ్‌కి ఎదురవుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు ‘Y కేటగిరీ భద్రత ఉండగా.. ఇప్పుడు రాష్ట్ర పగ్గాలు చేపట్టడంతో దానిని మరింత కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ జారీ చేసింది.

నూతన భద్రతా ఏర్పాట్ల ప్రకారం మొత్తం 55 మంది కేంద్ర భద్రతా సిబ్బంది 24 గంటల పాటు విజయ్‌కి రక్షణగా ఉంటారు. ఈ బృందంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కి చెందిన 10 మందికి పైగా ఎలైట్ కమాండోలు ఉంటారు. వీరంతా అత్యాధునిక MP5 సబ్ మెషిన్ గన్‌లతో నిరంతరం సీఎం వెంటే ఉంటారు. వీటితో పాటు విజయ్ ప్రయాణాల కోసం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని.. ముందు భాగంలో పైలట్ కారును కూడా కేంద్రం కేటాయించింది. సాధారణంగా దేశంలో ప్రాణహాని ఉన్న అతి కొద్ది మంది వీఐపీలకు మాత్రమే ఈ స్థాయి భద్రతను కల్పిస్తారు.

Advertisement

సోమవారం జరిగిన 17వ తమిళనాడు శాసనసభ మొదటి సెషన్‌లో విజయ్ పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రొటెం స్పీకర్ కరుప్పయ్య అధ్యక్షతన జరిగింది. విజయ్ పెరంబూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మొదట ప్రమాణం చేయగా.. ఆ తర్వాత టీవీకే మంత్రులు.. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. ఇతర మాజీ మంత్రులు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

విజయ్ గత ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్.. తిరుచ్చి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పెరంబూర్ స్థానాన్ని తన వద్దే ఉంచుకుని.. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనివల్ల 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Read Also: తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం.. స్టాలిన్‌ నివాసానికి వెళ్లిన సీఎం విజ‌య్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×