E-Paper
Advertisement

Kejriwal Supreme court: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. విచారణ వాయిదా

Kejriwal Supreme court: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. విచారణ వాయిదా
Advertisement

Kejriwal Supreme court| ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఢిల్లీ మద్యం పాలసీ అవినీతి కేసులో బుధవారం కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని.. సిబిఐకి నోటీసులు మాత్రమే జారీ చేస్తామని కేజ్రీవాల్ లాయర్ అభిషేక్ మను సింఘ్వికి చెప్పింది.

కేజ్రీవాల్ పిటీషన్ పై స్పందించాలని కేంద్ర విచారణ ఏజెన్సీ సిబిఐకి నోటీసులు జారీచేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో తనను చట్టవ్యతిరేకంగా అరెస్టు చేశారని సిబిఐ అధికారులపై కేజ్రీవాల్ పిటీషన్ వేశారు. కానీ ఆయన అరెస్ట్ లో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని హైకోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. దీంతో కేజ్రీవాల్ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

Advertisement

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

బుధవారం కేజ్రీవాల్ విచారణ చేప్పట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణని ఆగస్టు 23వ తేదికి వాయిదా వేసింది.

Advertisement

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

ఢిల్లీ ప్రభుత్వం 2022లో కొత్త మద్యం పాలసీ నియమాలు రూపొందించడంలో అవినీతి పాల్పడ్డారనే అరోపణలు రావడంతో.. ఢిల్లీ గవర్నర్ సిబిఐకి విచారణ చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 17 నెలలు జైలులో ఉన్న తరువాత సుప్రీం కోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఈ కేసులో మరో నిందితురాలు తెలంగాణ బిఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు కె కవిత కూడా జైల్లోనే ఉన్నారు.

Also Read: హిండెన్‌బర్గ్ Vs సెబీ చీఫ్‌.. ఛాలెంజ్‌పై మాదభి మాటేంటి?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×